అనిరుధ్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ కోరిక తీరుస్తాడా…!

తమిళంతో పాటు సౌత్ ఇండియాలో కూడా స్టార్ మ్యూజిక్ డైరెక్టర్గా దూసుకుపోతున్న అనిరుధ్ ఎప్పుడు చూసినా ట్రెండింగ్ లో ఉంటున్నాడు. ఇంకా బాలీవుడ్ లో కూడా అనిరుధ్ సమయం ప్రారంభం అయినట్లుగా ఉంది. షారుక్ ఖాన్ హీరోగా నటించిన జవాన్ చిత్రానికి కూడా అనిరుధ్ సంగీతాన్ని అందించాడు. ప్రస్తుతం ఆ సినిమా సాంగ్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.
ఇక జైలర్ సినిమా కోసం అనిరుద్ అందించిన.. వా నువ్వు కావాలయ్యా సాంగ్ ఏ రేంజ్ లో వైరల్ అవుతుందో మనం చూస్తూనే ఉన్నాం.

ఇలా అనేక అనిరుధ్ పాటలు సోషల్ మీడియాలో సందడి చేస్తున్నాయి. ఈ సమయంలో ఎన్టీఆర్ ఫ్యాన్స్ చాలా ఆస‌క్తిగా దేవర సినిమా పాటల కోసం ఎదురుచూస్తున్నారు. కొరటాల శివ దర్శకత్వంలో ఎన్టీఆర్ హీరోగా రూపొందుతున్న దేవర చిత్రానికి అనిరుధ్ సంగీతాన్ని అందిస్తున్నాడు. ఇప్పటికే ఒకటి రెండు పాటల రికార్డింగ్ కూడా పూర్తి అయిందని సమాచారం. ఈ ఏడాది చివరి నుంచి దేవర పాటల పండగ ప్రారంభం అయ్యే అవకాశం ఉందని తెలుస్తుంది. ఈ పాటలు ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నట్లయితే సినిమాకి ప్లస్ అయ్యే అవకాశం ఉంది.

దేవర పాటలతో ప్రేక్షకులను అనిరుధ్ కచ్చితంగా మెస్మరైజ్ చేసే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తుంది. ఇప్పటివరకు స్టార్ హీరోలకు అనిరుద్ సూపర్ హిట్ సాంగ్స్ ను అందించలేకపోయాడు. అందుకే దేవర సినిమాపై ఎక్కువ ఫోకస్ తో అనిరుధ్ కష్టపడుతున్నట్లు తెలుస్తుంది. ఈ సినిమాలో ఎన్టీఆర్ కి జోడిగా జాన్వీ కపూర్ నటిస్తుంది. మంచి మ్యూజిక్ పడితే ఎన్టీఆర్ తన డాన్స్ తో అదరగొట్టే అవకాశం ఉంది. ఎన్టీఆర్ అభిమానులు మాత్రం దేవర ఆల్బం పై చాలా ఆశలే పెట్టుకుని ఎదురు చూస్తున్నారు.