మెహర్ రమేష్ దర్శకత్వం వహిస్తున్న భోళా శంకర్ సినిమాలో మిల్కీ బ్యూటీ తమన్న, కీర్తి సురేష్, సుశాంత్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తిచేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటున్న ఈ సినిమా ఈనెల 11న ప్రేక్షకుల ముందుకి రానుంది. ఈ క్రమంలో కొద్ది రోజులుగా ఈ సినిమా ప్రమోషన్స్‌లో వేగం పెంచారు మేకర్స్.
ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన సాంగ్స్, టీజర్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. తాజాగా ఈ సినిమాపై ఫ్రీరిలీజ్ ఈవెంట్‌కు డేట్ ఫిక్స్ చేసింది చిత్ర యూనిట్. భోళా శంకర్ ఈవెంట్ ఈనెల 6న హైదరాబాద్ శిల్పకళావేదికలో గ్రాండ్గా నిర్వహిస్తున్నట్లు అనౌన్స్ చేశారు మేకర్స్. అయితే ఈ వేడుకకు అతిథిగా ఎవరు రాబోతున్నారు అనేది మాత్రం చెప్పలేదు.
ఇక ఫ్రీ రిలీజ్ ఈవెంట్ డేట్, ప్లేస్ తెలియడంతో మెగా అభిమానులు వేడుకకు హాజరయ్యేందుకు సిద్ధమవుతున్నారట. తమిళ్ లో సూపర్ హిట్ అయిన వేదాళం సినిమాకు తెలుగు రీమేక్ గా ఈ సినిమాని తెరకెక్కించారు మెహర్ రమేష్. గ్యాంగ్ స్టార్ బ్యాక్ డ్రాప్ లో సిస్టర్ సెంటిమెంట్తో రాబోతున్న. ఈ సినిమాలో చిరు డ్రైవర్ పాత్రలో కనిపించనుండగా…. ఆయనకు చెల్లిగా కీర్తి సురేష్ కనిపించనుంది. ఈ చిత్రానికి మహతి స్వర సాగర్ సంగీతాన్ని అందించారు. భోళా శంకర్ ఈనెల 11న ప్రేక్షకులను ఆకట్టుకుంటుందో లేదో చూడాలి.