కృష్ణాలో 40 వేల ఓట్ల తేడాతో ఓడిపోవ‌డానికి రెడీగా ఉన్న వైసీపీ టాప్ లీడ‌ర్‌…!

ఏపీలో 2024 ఎన్నికల్లో తెలుగుదేశం జనసేన పొత్తు ఉంటుందా ఉండదా ? అన్నదే ఇప్పుడు రాజకీయ వర్గాల్లో పెద్ద హాట్‌ టాపిక్. ఎవరి అంచనాలు ఎలా ఉన్నా ఈ రెండు పార్టీలు పొత్తు పెట్టుకుంటే కచ్చితంగా అధికార వైసిపికి ముచ్చెమట్టలు పట్టిస్తాయనటంలో సందేహం లేదు. 2014 ఎన్నికల్లో జనసేన ఎన్నికల్లో పోటీ చేయకుండా తెలుగుదేశం పార్టీకి సపోర్ట్ చేసింది అందుకే కాపు సామాజిక వర్గం బలంగా ఉన్న ప్రాంతాల్లో తెలుగుదేశం స్వీప్ చేసి పడేసింది. కృష్ణ, గుంటూరు, ఉభయగోదావరి, ఉత్తరాంధ్ర ప్రాంతాల్లో తెలుగుదేశం పార్టీకి వచ్చిన సీట్లతోనే చంద్రబాబు సమైక్యాంధ్రకు తొలి ముఖ్యమంత్రి అయ్యారు.

అలాగే కాపు సామాజిక ప్రభావం అంతగా లేని రాయలసీమ ప్రాంతాల్లో వైసిపి 2014 లోను గణనీయమైన సీట్లు సాధించింది 2019 ఎన్నికల్లో జనసేన, టిడిపి వేర్వేరుగా పోటీ చేశాయి. జనసేన ప్రభావంతో తెలుగుదేశం పార్టీ కనీసం 40 నియోజకవర్గాల్లో అతి స్వల్ప మెజార్టీతో ఓడిపోయింది. ఈసారి రెండు పార్టీలు కలుస్తాయి అన్న ఊహాగానాలు అంచనాలు వైసిపి నేతల గుండెల్లో రైళ్లు పరిగెత్తించేస్తున్నాయి.

ఇప్పటికే వైసీపీ నేతల అంతర్గత చర్చల్లో జనసేన – టిడిపి కలిసి పోటీ చేస్తే తమ పని గల్లంతే అని.. ఇప్పటికే ప్రభుత్వంపై వ్యతిరేకత తీవ్రంగా ఉందని రాష్ట్రంలో ఎక్కడ చూసినా అభివృద్ధి లేదన్న విమర్శలు వస్తున్నాయని.. ఇలాంటి టైంలో ఆ రెండు పార్టీలు కలిస్తే జనసేన ప్రభావం ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో వైసీపీకి ఘోరమైన ఓటమి తప్ప‌ద‌ని అంటున్నారు.

ఈ క్రమంలోనే కృష్ణా జిల్లాలో వైసీపీ కీలక నేత మాజీమంత్రి పేర్ని నానికి జనసేన ఎఫెక్ట్ గట్టిగా ఉండేలా కనిపిస్తోంది. వచ్చే ఎన్నికల్లో పేర్ని నానికి పోటీ చేయటం ఇష్టం లేదని అంటున్నారు. ఆయన వారసుడు పేర్ని కిట్టు బరిలోకి దిగుతానని అంటున్న.. జగన్ మాత్రం నానియే పోటీ చేయాలని చెప్పారని కూడా వార్తలు వస్తున్నాయి. బందరులో కాపు సామాజిక వర్గ ప్రభావం ఎక్కువగా ఉంటుంది. జనసేన, టిడిపి పొత్తు పెట్టుకుంటే బీసీలతో పాటు కాపులంతా ఒక్కటి అయితే కచ్చితంగా పేర్ని నాని ఓడిపోతారని స్థానికంగా చర్చ నడుస్తోంది.

ఇంకా చెప్పాలంటే ప్రభుత్వంపై వ్యతిరేకత తీవ్రంగా పెరిగి జనసేన – టిడిపి కాంబినేషన్ బలంగా వర్కౌట్ అయితే పేర్ని నాని 40 వేల ఓట్ల పై చిలుకు మెజార్టీతో ఓడిపోయినా.. ఆశ్చర్య పడక్కర్లేదని కూడా స్థానికంగా టాక్ వినిపిస్తోంది. ఇప్పటికే బందరులో కాపు వర్గం నానిపై గుర్రుగా ఉన్న పరిస్థితి కనిపిస్తోంది.
ఇలాంటి టైంలో జనసేన – టిడిపి పొత్తు ఉంటే కచ్చితంగా ఆయనకు భారీ షాక్ తప్పదనే అంటున్నారు.

Tags: ap politics, election survey, intresting news, latest news, polititions, social media, social media post, telugu news, Tollywood, tollywood news, viral news