వైసీపీలో టాప్ లీడ‌ర్ల మ‌ధ్య కోల్డ్‌వార్‌… అందుకే పార్టీలో ఇంత జ‌రుగుతోందా…!

నిప్పు లేనిదే పొగ రాదని అంటారు. మనకు కనపడేది వచ్చే పొగ.. కానీ దాని వెనకాల నిప్పు ఎక్కడ ?రాజుకుంది… ఎలా రాజుకుంది ? దానికి కారణమైన వాళ్ళు ఎవరు ? అన్నది మాత్రం తెలియదు. అయితే పైకి కనపడే పొగలో మాత్రం అసంతృప్తి అసమతి జ్వాలలు ఎగసిపడుతూ ఉంటాయి. ఇప్పుడు వైసిపిలో ఉన్న ఈ అసంతృప్తి అసమ్మ‌తి జ్వాల‌ల వెనక జగన్ బాగా నమ్మిన సలహాదారులు కూడా ఉన్నారన్న చర్చ రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది. నిజానికి ప్రజల్లో బలం ఉండి రాజకీయంగా ఎన్నో ఏళ్ల అనుభవం ?ఉండి రెండు మూడు సార్లు గెలిచిన ఏ ఎమ్మెల్యే కూడా వేరే పార్టీలోకి వెళ్లాలని అనుకోడు.

అయితే కొన్ని ప్రత్యేక పరిస్థితులు సృష్టించబడితే కచ్చితంగా పార్టీ వీడాలని అనుకుంటారు. ఒకే పార్టీని నమ్ముకుని ఉన్న సీనియర్ ఎమ్మెల్యేలు ఆ పార్టీని వీడే పరిస్థితి వచ్చింది అంటే.. వాళ్ళ ఆత్మ అభిమానం ఎక్కడో దెబ్బతిందని అర్థం చేసుకోవాలి. జగన్ కు వీరభక్తుడిగా ఉన్న కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి వైసిపి పెట్టినప్పటి నుంచి ఆ పార్టీలోనే ఉండి.. జగన్ కోసం తన ఎమ్మెల్యే పదవి వదులుకొని ఉప ఎన్నికల్లో గెలిచిన మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి లాంటి నేతలు ఈరోజు పార్టీ నుంచి బయటికి వెళ్లాల్సిన పరిస్థితి వచ్చిందంటే.. పార్టీలో ఏ స్థాయిలో అసమ్మ‌తి జ్వాలలు ఉన్నాయో తెలుస్తోంది.

 

అయితే వైసిపిలో కొందరు కీలక సలహాదారులతోపాటు జగన్ కు అత్యంత సన్నిహితంగా ఉన్న నేతల మధ్య జరుగుతున్న కోల్డ్ వార్ ఇప్పుడు పార్టీని ముంచేస్తుందని.. పార్టీలో ముసలానికి కారణమవుతుందని వైసిపి వర్గాల్లోనే చర్చ‌ నడుస్తోంది. 2014 ఎన్నికలకు ముందు వరకు జగన్ జైల్లో ఉన్నప్పుడు కూడా ఒక కీలక నేత చక్రం తిప్పారు. 2019 ఎన్నికల తర్వాత పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే ఆయనను పక్కనపెట్టి మరో కీలక నేతను దగ్గరకు చేర్చుకున్నారు. ఇప్పుడు ఆయన కూడా సైడ్ అయినట్టే కనిపిస్తుంది.

ఇప్పుడు వైసీపీలో మరో కీలక నేత చక్రం తిప్పుతున్నారు దీంతో వీరి మధ్య న‌డుస్తున్న‌ అంతర్గత యుద్ధంలో పార్టీలో ఎమ్మెల్యేలు బలైపోతున్నట్టు కనిపిస్తోంది. ప్రస్తుతం జగన్ కు అత్యంత సన్నిహితంగా ఉన్న నేతే కావాలని కొడాలి నాని, పేర్ని నాని, అనిల్ కుమార్ యాదవ్ లాంటి ఫైర్ బ్రాండ్లను మంత్రి పదవుల‌ నుంచి తెప్పించారని.. అసలు వీళ్ళు క్యాబినెట్లో లేకపోవడంతో జగన్ క్యాబినెట్ కళ కోల్పోయిందని కూడా పార్టీ నేతల్లో చర్చ జరుగుతుంది.

 

ప్రస్తుతం జగన్ కు అత్యంత సన్నిహితంగా ఉన్న నేత తీరు వల్లే చాలామంది పార్టీకి దూరం అవుతున్నారు. ఆయన తనకు నచ్చిన వాళ్లకు పదవులు ఇస్తూ ఇష్టం వచ్చినట్టుగా వ్యవహరిస్తూ పార్టీని నిలువునా ముంచేస్తున్నారని అంటున్నారు. ఏదేమైనా జగన్ తక్షణమే పార్టీలో ఎక్కడెక్కడ తప్పులు జరుగుతున్నాయో ? గమనించకపోతే వచ్చే ఎన్నికలకు ముందుగా పార్టీకి మరిన్ని ఎదురు దెబ్బలు తప్పేలా లేవని ఆ పార్టీ నేతల మధ్య పెద్ద చర్చ నడుస్తోంది.

Tags: AP, ap politics, intresting news, latest news, latest viral news, social media, social media post, telugu news, trendy news, viral news, ysrcp