వైసీపీని, జ‌గ‌న్‌ను నిండా ముంచేసేది ఆ ఒక్క‌డేనా… రెబ‌ల్ ఎమ్మెల్యే చెప్పిన నిజాలు…!

ఏపీలో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలలో ప్రతిపక్ష టీడిపి అనూహ్యంగా ఒక ఎమ్మెల్సీ సీటును గెలుచుకుంది. ఆ పార్టీ నుంచి పోటీ చేసిన విజయవాడ మాజీ మేయర్ పంచుమ‌ర్తి అనురాధ 23 ఓట్ల తేడాతో విజయం సాధించారు. వైసిపి నుంచి ఏకంగా నలుగురు ఎమ్మెల్యేలు టీడిపి అభ్యర్థికి క్రాస్ ఓటింగ్ చేయడంతో వైసిపి నుంచి పోటీ చేసిన కోలా గురువులు ఓటమిపాలయ్యారు. దీంతో వైసిపి అధిష్టానం వెంటనే క్రాస్ ఓటింగ్ చేసిన నలుగురు ఎమ్మెల్యేలను గుర్తించి పార్టీ నుంచి సస్పెండ్ చేసింది. వీరిలో నెల్లూరు జిల్లా నుంచి ఏకంగా ముగ్గురు సీనియర్ ఎమ్మెల్యేలు ఉండటం విశేషం.

వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రామనారాయణరెడ్డి, ఉదయగిరి ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఈ ముగ్గురితో పాటు గుంటూరు జిల్లా తాడికొండ ఎమ్మెల్యే ఉండవెల్లి శ్రీదేవిని కూడా పార్టీ నుంచి బహిష్కరించిన సంగతి తెలిసిందే. అయితే పార్టీలో చాలామంది ఎమ్మెల్యేలు సజ్జల రామకృష్ణారెడ్డి తీరుతోనే తమకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని ముందు నుంచి చెబుతూ వస్తున్నారు.

YSRC leadership irked with MP Vijayasai Reddy's antics

ఇక పార్టీ నుంచి సస్పెన్షన్‌కు గురైన సీనియర్ ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి కూడా సజ్జలపై విరుచుకుపడ్డారు. పార్టీలో సజ్జల‌ ఏక చక్రాధిపత్యం కొనసాగుతోందని… తాను సీనియర్ పొలిటిషియన్ ను అని.. ఎంతోమంది పెద్దపెద్ద నేతల దగ్గర పని చేశానని.. తనకు ఎప్పుడూ ఎలాంటి సమస్య రాలేదని చెప్పారు. వైసిపి ప్రభుత్వం ముందు నుంచి ప్రజాస్వామికంగా వ్యవహరిస్తుందని… ఈ విషయాన్ని తాను ఓపెన్ గా చెబితే తట్టుకోలేని కొంతమంది వ్యక్తులు తనపై క‌క్ష‌ కట్టారని ఆనం ఆరోపించారు.

ఒక మామూలు వ్యక్తిగా రాజకీయాల్లో అడుగుపెట్టిన సజ్జల ఇప్పుడు రు. 100 కోట్లకు ఎలా పడగలెత్తారని ?ఆనం ప్రశ్నించారు. సజ్జల వైసిపిలో ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని.. ఆయన తీరువల్లే జగన్ కు పార్టీకి చెడ్డ పేరు వస్తుందని కూడా ఆనం ఫైర్ అయ్యారు. ఇక తాను క్రాస్ ఓటింగ్ కు పాల్పడలేదని దమ్ముంటే నిరూపించాలని కూడా సవాల్ విసిరారు. ఆనంతో పాటు మరో రెబల్ ఎమ్మెల్యే శ్రీదేవి కూడా సజ్జలనే టార్గెట్ చేశారు. అస‌లు ఆయ‌న వ‌ల్ల త‌న‌కు ఏకంగా ప్రాణ‌హానీ ఉంద‌ని ఆరోపించ‌డం గ‌మ‌నార్హం.

అలాగే నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటం రెడ్డి కూడా సజ్జలనే టార్గెట్ చేశారు. మేక‌పాటి చంద్ర‌శేఖ‌ర్ రెడ్డి అదే తీరుతో ఉన్నారు. వీళ్ల వ్యాఖ్య‌ల‌ను బ‌ట్టి చూస్తే వైసిపిలో చాలామంది ఎమ్మెల్యేలు సజ్జలు తీరుతోనే ఇబ్బందులు పడుతున్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇక మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి అయితే పార్టీలో ఏకంగా 40 మందికి పైగా ఎమ్మెల్యేలు అసంతృప్తితో ఉన్నారని చెప్పిన సంగతి తెలిసిందే. ఏదేమైనా జగన్ పార్టీలో విజయసాయిరెడ్డి, సుబ్బారెడ్డిని నమ్ముకున్నప్పుడు ఈ తరహా ఇబ్బందులు రాలేదు. ఎప్పుడు అయితే సజ్జల పెత్త‌నం మొదలైందో అప్పటి నుంచి అందరూ ఇబ్బంది పడుతున్నార‌ని.. జ‌గ‌న్ దీనిని గ‌మ‌నించి చ‌ర్య‌లు తీసుకోక‌పోతే ఆయ‌న కూడా మునిగి పోతార‌ని వైసీపీ వాళ్లే చెపుతున్నారు.

Tags: AP, ap politics, intresting news, latest news, latest viral news, social media, social media post, tdp, telugu news, trendy news, viral news, ysrcp