ప‌లాస రాజ‌కీయం మారుతోందా… మంత్రి ‘ సీదిరి ‘ ప్ర‌భ మ‌స‌క‌బారుతోందా…!

ఏదో చేస్తార‌ని.. త‌మ‌కు ఏదో ఒరుగుతుంద‌ని.. ఆశించిన ప‌లాస నియోజ‌క‌వ‌ర్గం ప్ర‌జ‌ల‌కు ప్ర‌స్తుతం ఎమ్మె ల్యే క‌మ్ .. మంత్రిగా ఉన్న సీదిరి అప్ప‌ల‌రాజు.. చుక్క‌లు చూపిస్తున్నారనే టాక్ వినిపిస్తోంది. కేవ‌లం త‌న మందీ మార్బ‌లాన్ని పోషించుకునేందుకు.. త‌న ఇమేజ్‌ను జాకీవేసి పెంచుకునేందుకు.. పోతున్న దానిని కాపాడుకునేందుకు మాత్ర‌మే.. ఆయ‌న ప్రాధాన్యం ఇస్తున్నార‌నే టాక్ వినిపిస్తోంది. నిజానికి గ‌త ఎన్నిక‌ల‌కు ముందు వ‌ర‌కు ఇక్క‌డ గౌతు కుటుంబం హ‌వానే కొన‌సాగింది.

అయితే.. గత ఎన్నిక‌ల్లో వైసీపీ సునామీ కారణంగా.. వ‌ర‌ద‌లో కొట్టుకొచ్చిన‌.. పిల్ల చేప మాదిరిగా సీదిరి అప్ప‌ల‌రాజు.. ప‌లాస నుంచి విజయం ద‌క్కించుకున్నార‌ని.. ఆయ‌న‌కు నియోజ‌క‌వ‌ర్గం ప్ర‌జ‌ల కంటే కూడా.. హంగామా.. నిత్యం మీడియాలో ఉండాల‌నే ఆతృత‌ ఎక్కువ‌గా ఉంద‌నే విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి. ప్ర‌తి విష‌యంలోనూ.. ఆయ‌న వివాదాస్ప‌దం అవుతుండ‌డం.. క‌నీసం సొంత పార్టీ నేత‌ల‌లోనూ.. ఆయ‌న ప‌ట్టు లేక‌పోవ‌డం.. వంటివి తీవ్రస్థాయిలో చ‌ర్చ‌కు వ‌స్తున్నాయి.

ఈ నేప‌థ్యంలో త‌మ‌కు కొర‌గాకుండా ఉన్న ఎమ్మెల్యేను వ‌దిలించుకోవ‌డ‌మే బెస్ట్ అని.. స్థానికంగా పెద్ద చ‌ర్చ జ‌రుగుతోంది. ఇక్క‌డ ఉండే.. బీసీలు.. ఎస్సీలు.. ప్ర‌ధానంగా.. మంత్రి విష‌యంలో చీద‌రించుకుం టున్నార‌నే టాక్ వినిపిస్తుండ‌డంతో ఆయ‌న‌ను స‌మ‌ర్ధిస్తే.. త‌మ‌కు ఎక్క‌డ ఇబ్బందులు వ‌స్తాయోన‌ని.. సీదిరికి వైసీపీలోని ఇత‌ర నాయ‌కులు కూడా దూర‌మ‌వుతున్నాయి. ఇదిలావుంటే..మ‌రోవైపు.. స‌మ‌స్య‌ల‌పై స్పందించ‌డంలో.. టీడీపీ యువ నాయ‌కురాలు.. గౌతు శిరీష దూకుడుగా ఉన్నారు.

ఎక్క‌డ స‌మ‌స్య ఉంటే అక్క‌డ స్పందిస్తున్నారు. అదే స‌మ‌యంలో ప్ర‌భుత్వ దూకుడుతో ఇబ్బంది ప‌డు తున్న పార్టీ కార్య‌క‌ర్త‌ల‌కు కూడా ఆమె అండ‌గా నిలుస్తున్నారు. ఇక‌, పార్టీ అధినేత చంద్ర‌బాబు పిలుపు మేర‌కు ఆమె పార్టీ కార్య‌క్ర‌మాలు కూడా నిర్వ‌హిస్తున్నారు. కార‌ణం ఏదైనా గ‌త ఏడెనిమిది నెల‌లుగా సీదిరి బేజార‌వుతోంటే శిరీష జోరుగా ఉన్నారు. ఇదే విష‌యం ఇటు టీడీపీలోనూ.. అటు వైసీపీలోనూ అంత‌ర్గ‌త చ‌ర్చ‌ల్లో తెలుస్తోంది. వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఆమె విజ‌యం ఖాయ‌మ‌ని కూడా పార్టీ నాయ‌కులు చ‌ర్చించుకుంటున్నారు.

దీంతో ప‌లాస రాజ‌కీయం మార‌డం ఖాయ‌మ‌ని.. వ‌చ్చే ఎన్నిక‌ల్లో సీదిరి గెలుపు అంచ‌నాలు రోజు రోజుకు మ‌స‌క‌బారుతున్నాయ‌ని ప‌లాస‌లోనే పెద్ద ఎత్తున చ‌ర్చ న‌డుస్తోంది. మ‌రోవైపు.. సీదిరిని సొంత పార్టీ నాయ‌కులే ప‌క్క‌న పెడుతున్నారు. ఈ ప‌రిణామాల‌తో.. ప‌లాస నియోజ‌క‌వ‌ర్గంలో త్వ‌ర‌లోనే రాజ‌కీయ ప‌రంగా అనేక సంచ‌ల‌నాల‌కు కూడా స్కోప్ క‌నిపిస్తోంది.

Tags: andhra pradesh politics, andhrapolitics, ap politics, sidiri apalaraju, tsrcp