ఆర్.ఆర్.ఆర్ తర్వాత చరణ్ (Ram Charan) జెర్సీ డైరక్టర్ గౌతం తిన్ననూరితో సినిమా చేస్తాడని అన్నారు. మళ్లీ రావా సినిమాతో డైరక్టర్ గా మెప్పించిన గౌతం నానితో జెర్సీ తీసి సూపర్ హిట్ కొట్టాడు. ఆ సినిమా కమర్షియల్ గా కన్నా ప్రేక్షకుల మనసులు ఎక్కువ గెలిచింది. ఆ క్రేజ్ తోనే గౌతం తో చరణ్ సినిమా ఫిక్స్ చేసుకున్నాడు.
ఇదిలాఉంటే గౌతం హిందీ జెర్సీ సినిమాని డైరెక్ట్ చేశాడు. ఆ సినిమా హిట్ అయితే పరిస్థితి ఎలా ఉండేదో కానీ ఆ సినిమా ఫ్లాప్ అవడంతో చరణ్ (Ram Charan) ఆలోచనలో పడ్డాడని తెలుస్తుంది. ఈ క్రమంలో ఆర్.ఆర్.ఆర్ తర్వాత గౌతం కి హ్యాండ్ ఇచ్చి శంకర్ డైరక్షన్ లో సినిమా ఫిక్స్ చేసుకున్నాడు. శంకర్ తో సినిమా తర్వాత అయినా గౌతం తో చేస్తాడా అన్న క్లారిటీ లేదు.
అందుకే గౌతం తిన్ననూరి మరో హీరోని వెతుక్కునే పనిలో పడ్డాడని తెలుస్తుంది. గౌతం తిన్ననూరి నెక్స్ట్ సినిమా యువ హీరోతో ఉంటుందని తెలుస్తుంది. మరి ఆ సినిమాకు సంబందించిన డీటైల్స్ త్వరలో తెలుస్తాయి.