Hero Heroine : హీరోయిన్ తో ప్రేమ.. రెమ్యునరేషన్ కూడా ఆమెకే ఇచ్చేసిన హీరో..!

తెర మీద కనిపించే హీరో.. హీరోయిన్ల (Hero Heroine ) మధ్య కొన్నిసార్లు రీల్ రిలేషన్ షిప్ కాకుండా రియల్ రిలేషన్ షిప్ కూడా ఉంటుంది. సినిమాలో జోడీ బాగుందని అంటే చాలు వారికి ఎక్కడలేని క్రేజ్ వస్తుంది. అలానే కోలీవుడ్ లో ఒక క్రేజీ జంటగకి సూపర్ క్రేజ్ ఏర్పడింది. వాళ్లెవరు అంటే హీరో కార్తీ.. హీరోయిన్ తమన్నాల మధ్య సంథింగ్ సంథింగ్ అని వార్తలు వచ్చాయి.

Hero Heroine వీరిద్దరు ప్రేమించుకుంటున్నారని కోలీవుడ్ మీడియా వార్తలు రాసింది. కార్తీతో తమన్నా మూడు సినిమాల్లో నటించింది. ఈ మూడు సినిమాలతో ఇద్దరి మధ్య సన్నిహిత సంబంధం ఏర్పడిందని టాక్. ఒకానొక దశలో కార్తీ తమన్నాని పెళ్లి చేసుకుంటాడని కూడా వార్తలు వచ్చాయి. అయితే ఈ క్రమంలోనే ఒక సినిమాలో తన రెమ్యునరేషన్ కూడా తమన్నాకి ఇచ్చేసినట్టు టాక్.

అయితే ఇదంతా పాత కథ. హాయిగా కార్తీ పెళ్లి చేసుకుని హ్యాపీగా ఉన్నాడు. వరుస డిఫరెంట్ స్టోరీస్ తో కార్తీ సత్తా చాటుతున్నాడు. తమన్నా కూడా ఆమె స్టైల్ లో సినిమాలు చేస్తూ మెప్పిస్తుంది.

Tags: 3 Movies, Kollywood, Remuneration, Star hero, Star Heroine