బాబు చిట్టీ.. ఆ ప‌త్రాల‌ను భ‌ద్రంగా దాచుకో..

నారా చంద్రబాబునాయుడు కుటుంబం ఆస్తులు, అప్పుల వివరాలను ఆయ‌న త‌న‌య‌డు, మాజీ మంత్రి నారా లోకేష్ ఇటీవ‌లే ప‌త్రికాముఖంగా ప్రకటించారు. తొమ్మిదేళ్లుగా ప్ర‌తి సంవ‌త్స‌రం త‌మ ఆస్తుల వివ‌రాల‌ను వెల్ల‌డిస్తున్నామ‌ని, అందులో ఏడాది ప్ర‌క‌టిస్తున్నామ‌ని ఆయ‌న వివ‌రించిన సంగ‌తి తెలిసింది. ఆయ‌న తెలిపిన వివ‌రాల ప్ర‌కారం.. చంద్రబాబు కుటుంబం మొత్తం ఆస్తులు రూ.119.42 కోట్ల‌ని. అలాగే, మొత్తం అప్పులు రూ.26.04 కోట్ల‌ని ప్ర‌క‌టించిన తెలిపిన విష‌యం తెలిసిందే. అందులో తండ్రి చంద్రబాబు పేర రూ.9కోట్లు. అప్పులు రూ.5.13 కోట్లు. త‌ల్లి నారా భువనేశ్వరి పేర ఆస్తులు రూ.50.62 కోట్లు. అప్పులు రూ.11.04 కోట్లు. త‌న పేర మొత్తం రూ.24.70 కోట్లు. అప్పు రూ.5.70 కోట్లు. త‌న భార్య బ్రాహ్మణి పేర రూ.15.68 కోట్లు. అప్పులు రూ.4.17 కోట్లు, అదేవిధంగా త‌న కుమారుడు దేవాన్ష్ పేర‌ ఆస్తులు రూ.19.42 కోట్లు ఉన్న‌ట్లు వెల్ల‌డించారు. అదీగాక దేవాన్ష్‌కు హెరిటేజ్‌‌లో తన వాటాలో ఉన్న 26440 షేర్లను చంద్ర‌బాబు గిఫ్ట్‌గా ఇచ్చ‌న‌ట్లు లోకేష్ స్ప‌ష్టం చేశారు. మొత్తంగా గత ఏడాదితో పోల్చితే ఆస్తిలో రూ.2.27 కోట్లు పెరుగుదల (నికర ఆస్తిలో) ఉన్న‌ట్లు తెలిపారు. ఇదిలా ఉండ‌గా దీనిపై రాజ‌కీయ వ‌ర్గాల్లో భిన్న‌వాద‌న‌లు వినిపిస్తున్నాయి.

దీనిపై వైసీపీ ఎంపీ విజ‌య‌సాయిరెడ్డి స్పందించారు. త‌న ట్విట్ట‌ర్ వేదిక‌గా చంద్ర‌బాబు నాయుడి, నారా లోకేశ్ పై విమ‌ర్శ‌లు గుప్పించారు. ‘తండ్రేమో తన ఆస్తి లక్ష కోట్లని వేల మంది సాక్షిగా ప్రకటించాడు. చిట్టినాయుడేమో ఆస్తుల వివరాలంటూ, ఎండాకాలంలో లేచే సుడిగాలిలా అందరి కళ్లలో దుమ్ముకొడతాడు. ఈ ఐదేళ్లలో ఎంత నొక్కేసిందీ త్వరలోనే బయట పడుతుంది. అప్పటిదాకా ఆ ప‌త్రాల‌ను భద్రంగా దాచుకో చిట్టీ..!’ అని వ్యంగ్యాస్ర్తాల‌ను గుప్పించారు. ఇప్ప‌డు ఈ పోస్టు సోష‌ల్ మీడియాలై వైర‌ల్గా మారింది. అదేవిధంగా లోకేష్ ప్ర‌క‌టించిన ఆస్తుల వివ‌రాల‌పై భిన్న‌ర‌కాలుగా చ‌ర్చ‌లు సాగుతున్నాయి. మ‌రి అదంతా నిజ‌మేనంటారా? లేక ఉత్త‌దేన‌ని అని చెవులు కొరుక్కుంటున్నారు.

Tags: ASSETS, chandrababu, nara lokesh, YCP MP VIJAYA SAI REDDY