జబర్దస్త్‌లో యాంకర్‌గా బుల్లితెరకు పరిచయమై.. తన అభినయంతో.. అందచందాలతో అలరించిన యాంకర్ అనసూయ భరద్వాజ్ అనతికాలంలోనే ప్రేక్షకుల మన్ననలను పొందింది. తనకంటూ ఓ ప్రత్యేకతను సొంతం చేసుకుంది. ఆ ప్రత్యేకతనే ఆమెను కేరీర్‌లో మరో మలుపు తిప్పింది. సినిమాలకు మార్గాన్ని సుగమం చేసింది. అక్కడా తనదైన శైలీలో నటించి సినీ అభిమానులను మన్ననలను పొందింది. సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన రంగస్థలం సినిమాలో రంగమ్మత్త పాత్రలో ఒదిగిపోయిన తీరు అందరినీ ఆకట్టుకుంది ఈ బ్యూటీ. ఆ ఒక్క పాత్రతో ఆమె కెరీర్ మరో మలుపు తిరిగింది. ఆ సినిమా తర్వాత కూడా పలు సినిమాల్లో తన నటనాకౌశలాన్ని ప్రదర్శించింది. వరుసగా సినిమా అవకాశాలను సొంతం చేసుకుంటున్నది.
ఇదిలా ఉండగా.. ఈ ఏడాది కూడా అనసూయ పలు భారీ ప్రాజెక్టుల్లో కీలక పాత్రలను పోషిస్తున్నట్లు టాలీవుడ్ వర్గాలు చర్చించుకుంటున్నాయి. ఇప్పటికే పెళ్లిచూపులు సినిమా ఫేమ్ తరుణ్ భాస్కర్ హీరోగా విజయ్ దేవరకొండ నిర్మించిన మీకు మాత్రమే చెప్తా సినిమాలో అనసూయ కీ రోల్ను పోషించనున్నట్లు సమాచారం. ఈ మేరకు విజయ్ అవకాశం వచ్చినట్లు సమాచారం. అందులోనూ అనసూయ ప్రతినాయకురాలిగా కనిపించనున్నట్లు తెలుస్తున్నది. దీనిపై త్వరలో స్పష్టత రానుంది. అదీగాక మరోసారి సుకుమార్ దర్శకత్వంలో వచ్చే సినిమాలోనూ అనసూయ ఛాన్స్ కొట్టేసిందట. అదేవిధంగా పవన్‌కల్యాణ్-క్రిష్ తీయబోతున్న సినిమాలోనూ ఈ అమ్మడుకు అవకాశం వచ్చినట్లు టాలీవుడ్‌లో వార్తలు వినిపిస్తున్నాయి. ఏదేమైనా చేతినిండా సినిమాలతో అనసూయ ఫుల్ బిజీగా మారింది.