ఈఎస్ ఐ కుంభ‌కోణంలో టీడీపీ కీల‌క‌నాయ‌కుడు..?

ఏపీలో వెలుగు చూసిన ఈఎస్ ఐ కుంభ‌కోణంలో మ‌రో ట్విస్ట్ చోటు చేసుకుంది. ఇప్ప‌టికే గ‌డిచిన ఆరేళ్లలో రూ. కోట్లలో నిధుల‌ను స్వాహా చేశార‌ని ఇప్ప‌టికే విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ బయటపెట్టింది. లెజెండ్ ఎంటర్ ప్రైజెస్, ఓమ్మిమేడి ఎన్వెంటర్ ఫెర్ఫామెన్స్ పేరిట డొల్ల సంస్థలను సృష్టించి నకిలీ కొటేషన్లు తీసుకుని ఆర్డర్లు ఇచ్చినట్టు అధికారులు గుర్తించారు. రేట్ కాంట్రాక్ట్‌లో లేని ఆ కంపెనీలకు ఈఎస్ఐ డైరెక్టర్లు రూ. 51 కోట్ల చెల్లించినట్లు గుర్తించ‌డ‌మేగాక‌, ఆ మొత్తం వ్యవహారానికి ఈఎస్ఐ డైరెక్టర్లు రవికుమార్, రమేశ్, విజయ్‌ను బాధ్యుల‌ని త‌మ రిపోర్టులో పేర్కొన్నారు. మొత్తంగా డైరెక్టర్లు అక్రమంగా రూ. 85 కోట్లు చెల్లించార‌ని, స్కామ్‌లో ఈఎస్ఐ డైరెక్టర్లకు ఆరుగురు జాయింట్ డైరెక్టర్లు సహకరించారని అధికారులు నిగ్గు తేల్చారు.

ఇదిలా ఉండ‌గా తాజాగా ఈ కేసులోకి టీడీపీ సీనియర్ నేత, మాజీమంత్రి అచ్చెన్నాయుడు పాత్ర తెర మీద‌కు రావ‌డం చ‌ర్చ‌నీయాంశంగా మారింది. రాజ‌కీయ దుమారాన్ని రేపుతున్న‌ది. ఈ భారీ కుంభకోణంలో మాజీమంత్రి అచ్చెన్నాయుడు పాత్ర ఉందని విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు త‌మ రిపోర్ట్‌లో వెల్ల‌డించ‌డం గ‌మ‌నార్హం. నామినేషన్ పద్ధతిలో అచ్చెన్నాయుడు టెండర్లు ఇప్పించారని వారు త‌మ రిపోర్ట్‌లో ప్రస్తావించారు. టెలీ హెల్త్ సర్వీసుల పేరుతో ఆర్డర్స్ ఇవ్వడంలో అచ్చెన్నాయుడు సంబంధిత అధికారుల‌పై ఒత్తిడి తెచ్చారని… నామినేషన్ల పద్ధతిలోనే కేటాయించాలని ఆదేశించారని ఆ రిపోర్ట్ అధికారులు వివ‌రించారు. ఇప్ప‌డిది ఏపీ రాజ‌కీయాల్లో తీవ్ర చ‌ర్చ‌నీయాంశంగా మారింది. రాజ‌కీయ‌వ‌ర్గాల్లో తీవ్ర దుమారాన్ని రేపుతున్న‌ది. ఎటొచ్చి ఈ కుంభ‌కుణం మ‌రెన్ని మ‌లుపులు తిరుగుతుందోన‌ని స‌ర్వాత్రా జోరుగా చ‌ర్చ‌సాగుతున్న‌ది.

Tags: esi scam, shell companys, tdp ex minister k achnna naidu