డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా, పి. గన్నవరం ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబు తివ్ర అస్వస్థతకు లోనయ్యారు. ప్రస్తుతం ఆయన హైదరాబాద్ కిమ్స్‌లో ట్రీట్మెంట్ చేయించుకుంటున్నారు. బుధవారం రాత్రి ఎమ్మెల్యే అస్వస్థతకు గురవడంతో వెంటనే రాజమహేంద్రవరంలోని బొల్లినేని ఆసుపత్రిలో చేర్చారు.
అక్కడ ఎంఆర్ఐ స్కాన్ చేసిన వైద్యులు చిట్టిబాబు మెదడులో రక్తం గడ్డకట్టిందని గుర్తించారు. వెంటనే అంబులెన్స్ లో హైదరాబాద్ కిమ్స్ కి తరలించిన ఆయనకు ప్రస్తుతం ట్రీట్మెంట్ జరుగుతుంది. ఆరోగ్యం నిలకడగా ఉందని ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వైద్యులు చెప్పినట్లు ఎమ్మెల్యే కొడుకు వికాస్ వివరించాడు.