ఖుషి మూవీ కి ముందుగా అనుకున్నా హీరోయిన్ సమంత కాదా.. అన్నీ అనుకున్నట్టు జరిగితే మరో అర్జున్ రెడ్డి జస్ట్ మిస్..!

టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ, స్టార్ హీరోయిన్ సమంత ఎంతో పరిష్ఠాత్మకంగా కలిసి నటించిన మూవీ ఖుషి… టాలీవుడ్ స్టార్ ద‌ర్శ‌కుడు శివ నిర్మాణ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా తాజాగా ఈరోజు కొద్దిసేపటి క్రితమే పాన్ ఇండియా లెవెల్ లో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. లవ్ అండ్ ఫ్యామిలీ రొమాంటిక్ ఎంటర్టైనర్గా తెరకెక్కిన ఈ సినిమా మొదటి షో నుంచి పాజిటివ్ టాక్ తెచ్చుకుంది.

మరి ముఖ్యంగా ఈ సినిమాలో రియలిటీని బాగా చూపించాడు దర్శకుడు శివనిర్మాణ అంటూ కామెంట్లు కూడా వస్తున్నాయి. ఇది అందరికీ తెలిసిన రొటీన్ స్టోరీ అని పెద్దగా కొత్తగా వివరించాల్సిన అవసరం లేదని కామెంట్లు సైతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఇక ఈ క్రమంలోని మిక్స్ టాక్‌ సొంతం చేసుకున్న ఖుషి సినిమాకి సంబంధించిన ఓ ఇంట్రెస్టింగ్ వార్త సోషల్ మీడియాలో వైరల్ల్ గా మారింది.

ఈ సినిమాలో ముందుగా హీరోయిన్‌గా అనుకున్నది రష్మిక మందన్నాని అన్నట్టు తెలుస్తుంది. ముందుగా ఈ సినిమాలో హీరోగా విజయ్ దేవరకొండ ని ఫిక్స్ చేసుకున్న దర్శకుడు శివనిర్మాణ హీరోయిన్గా రష్మిక అయితే బాగుంటుందని భావించారట. అయితే అప్పటికే విజయ్- ర‌ష్మ‌క‌ చాలా సినిమాల్లో కలిసి నటించార‌ని మరోసారి ఇదే రిపీట్ అయితే బాగోదని భావించిన దర్శకుడు తర్వాత స్టార్ హీరోయిన్ గా ఉన్న సమంతను హీరోయిన్గా తీసుకుంటే సినిమాపై మంచి హైప్‌ వస్తుందని భావించారట.

ఇక అదే సమయానికి సమంత- నాగచైతన్యతో విడాకులు తీసుకుని సోషల్ మీడియాలో హాట్‌ టాపిక్ గా ట్రెండ్ అవుతూ వస్తుంది. అందుకే ఆ పాత్రకు సమంత నాయం చేయగలదు అంటూ ఆమెతో ఉన్న ఫ్రెండ్షిప్ కొద్దీ ఆమెకు వెళ్లి స్టోరీ వివరించారట.. స్టోరీ విన్న సమంత సినిమాకి నో చెప్పిన తర్వాత ఫైనల్ గా విజయ్ దేవరకొండ ఆమెతో మాట్లాడటంతో సినిమాను ఓకే చేసిందట. అలా ఈ సినిమా రష్మిక ద‌గ్గ‌ర‌ నుంచి సమంత ఖాతాలోకి వచ్చి పడింది. మరి ఈ సినిమా ఫస్ట్ డే కలెక్షన్స్ ఏ విధంగా ఉంటాయో చూడాలి..!