‘ ఖుషీ ‘ రివ్యూ.. విజయ్- స‌మంత‌ అనుకున్నది సాధించారా..?

విజయ్ దేవరకొండ, సమంత జంట‌గా న‌టించిన ఈసినిమాను డైరెక్టర్ శివ నిర్వాణ తెరకెక్కించిన లవ్ అండ్ రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ ‘ఖుషి’. రిలీజ్‌కు ముందు సినిమా నుంచి వ‌చ్చిన‌ సాంగ్స్ అండ్ ట్రైలర్ ఆడియన్స్ ని బాగా ఆకట్టుకున్నాయి. మలయాళ మ్యూజిక్ డైరెక్టర్ హేశం అబ్దుల్ వహాబ్ ఈ సినిమాకి సంగీతం అందించాడు. దీంతో మూవీ పై మంచి బజ్ బాగా పెరిగింది. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించిన ఈ చిత్రం నేడు పాన్ ఇండియా వైడ్ రిలీజ్ అయ్యింది. మరి థియేటర్స్ లో ఈ మూవీ ఏ మేరుకు ఖుషీని పంచిందో ఇక చూద్దం.

కాశ్మీర్ లో హీరోయిన్ ని చూసి హీరో ఇష్టపడతాడు. తర్వాత ఇద్దరూ ప్రేమించుకోగా పెళ్లికి పెద్దలు ఒప్పుకోకపోతే…ప్రేమ పెళ్లి చేసుకున్న తర్వాత వీళ్ళ లైఫ్ ఎలా సాగింది అన్న కాన్సెప్ట్ తో వ‌చ్చిన‌ ఖుషి మూవీ ఫస్టాఫ్ ఎంటర్ టైన్ మెంట్ తో పాటు లోకేషన్స్ మ‌రియు పాటలు ప్లస్ పాయింట్స్ గా నిలవగా మంచి ఆసక్తిని కలిగించే ఇంటర్వెల్ పాయింట్ తో సెకెండ్ ఆఫ్ మొదలు అయింది…

కొంచం అక్కడక్కడా స్లో అయ్యి ఫ్లో మిస్ అయినట్లు అనిపించడం, కథ చాలా వరకు ఈజీగా చెప్పే విధంగా ఉండటం లాంటివి చిన్న త‌ప్పులు ఉన్నా కూడా యూత్ ని మెప్పించే అంశాలు, ఫ్యామిలీస్ కి నచ్చే అంశాలు సినిమాలు బాగానే ఉన్నాయి…గీత గోవిందం రేంజ్ లో కాక పోయినా ఉన్నంతలో ఖుషి మూవీ రీసెంట్ విజయ్ దేవరకొండ మూవీస్ తో పోల్చితే చాలా బెటర్ గా ఉందని చెప్న వ‌చ్చు. ఈజీగా ఒకసారి చూసి ఎంజాయ్ చేసేలా సినిమా ఉందని, కామెడి కూడా కొన్ని సీన్స్ లో బాగానే వర్కౌట్ ఉంది.

‘ఖుషి’లో పాజిటివ్ పాయింట్స్ :
విజయ్ దేవరకొండ, సమంత నటనకు… వాళ్ళిద్దరి మధ్య కెమిస్ట్రీకి చా బాగుంది. తమ తమ పాత్రల్లో విజయ్ & సమంత జీవించారనే చెప్ప‌లి. ఆ తర్వాత కామెడీ కూడా చాలా బాగుంది. సినిమా విడుదలకు ముందు సాంగ్స్ సూపర్ హిట్ అయ్యాయి. స్క్రీన్ మీద కూడా వాటి పిక్చరైజేషన్ కూడా ఎంతో బాగుంది. సినిమా పాట‌లే చాల బాగున్నాయి.

మరి, మైనస్ పాయింట్స్:
‘ఖుషి’లో స్టోరీ చాల‌ సింపుల్‌గా ఉంది.. కథ నుంచి ప్రెక్ష‌కుడు పెద్దగా ఏమీ ఆశించాల్సిందేమీ లేదు. ఇక ఇది ఒక డీసెంట్ రొమాంటిక్ ఎంటర్టైనర్. ఇక ఈ సినిమాకి పెద్ద మైనస్ పాయింట్ ఏమిటంటే అది సినిమా రన్ టైం అని చెప్పాలి.

ఇక చివరిగా సమంత- విజయ్ దేవరకొండ ఖుషి సినిమాతో చాలా గ్యాప్ తర్వాత మంచి హిట్ కొట్టారనే చెప్పాలి.