వైసీపీ మంత్రి, మాజీ మంత్రి టీడీపీకి ఇంత ప్ల‌స్ అవుతున్నారా…!

మాజీ మంత్రి బాలినేని వర్సెస్ ఆదిమూలపు సురేష్ విభేదాలు టిడిపికి మేలు చేస్తున్నాయా అంటే అవునని అంటున్నాయి ప్రకాశం జిల్లా వర్గాలు. మాజీ మంత్రి బాలినేని వర్గం బలంగా ఉంది. అదే సమయంలో గత ఎన్నికల అనంతరం వైసిపిలో మంత్రి పదవిని దక్కించుకున్న బాలినేని శ్రీనివాస రెడ్డి.. త‌ర్వాత కోల్పోయారు అయితే, ఇదే జిల్లాకు చెందిన ఎర్ర‌గొండ‌పాలెం ఎమ్మెల్యే సురేష్‌కు రెండోసారి కూడా మంత్రిగా అవ‌కాశం ఇచ్చారు. అయితే ఆదిమూలపు సురేష్ ని కొనసాగించడానికి వీల్లేదని చాలాకాలం బాలినేని పోరాటం చేశారు. అయితే అది ఫలించలేదు.

balineni srinivasa reddy resign, వైసీపీకి ఊహించని ట్విస్ట్ ఇచ్చిన మాజీ  మంత్రి.. పదవికి రాజీనామా? - speculations that ex balineni srinivasa reddy  resign to ysrcp regional coordinator post - Samayam Telugu

కాకా ఇప్పుడు ఆ సురేష్ కు బాలినేనికి మధ్య తీవ్రమైనటువంటి విభేదాలు కొనసాగుతున్నాయని అంటున్నారు. ముఖ్యంగా బాలినేని హ‌వాను పక్కన పెట్టాలి అనే వ్యూహం కొన్నాళ్లుగా అమలు జరుగుతోంది. తాజాగా ఆయన వైసీపీ కో ఆర్డ‌నేట‌ర్‌ హోదా కూడా వదిలేసుకున్నారు. ప్రస్తుతం ఆయన కొన్ని జిల్లాలకు ఇన్చార్జిగా ఉన్నారు. కానీ ఇప్పుడు దాన్ని ఆయన వదిలేసుకోవడం ద్వారా తన నిరసనను వ్యక్తం చేశారు. ఇటీవల సీఎం జగన్మోహన్ రెడ్డి మార్కాపురంలో పర్యటించారు. ఈ పర్యటనలో బాలినేని శ్రీనివాసరెడ్డిని అడ్డుకున్నారు.

ఆయన సీఎం వేదిక వైపు వెళ్లకుండా పోలీసులు అడ్డుకోవడం చర్చినియాంశంగా మారింది. గత స్థానిక ఎన్నికలను తీసుకుంటే బాలినేని వర్గం బాగానే గెలిచింది. అదేవిధంగా ఒంగోలులో ఉన్నటువంటి ఆమంచి కృష్ణ‌మోహ‌న్‌ వర్గంతోను కలగలుపుగా ఉండటం పార్టీని డెవలప్ చేయటం సమస్యలు లేకుండా చూసుకోవడం బాలనేని వ్యూహాత్మకంగా అడుగులు వేశారు. ఈయనను కాదని తాడేపల్లిలో కీలక సలహాదారు చేస్తున్నటువంటి ప్రయత్నం కారణంగా బాలినేని వర్గం డైల మాలో పడిపోయింది.

Adimulapu Suresh clarifies on schools reopening, says no need to worry  about students health

పైకి చెప్పలేక లోలోను దాచుకోలేక శ్రీనివాస్ రెడ్డి సతమతమవుతున్నారు. గత నెల రోజుల నుంచి సీఎం జగన్మోహన్ రెడ్డిని కలవాలి ఆయన అపాయింట్మెంట్ కోసం వెయిట్ చేస్తున్నారు. ఈ క్ర‌మంలోనే మార్కాపురంలో నిర్వహించిన సభ అంది వచ్చింది. అయితే డిఎస్పీ ద్వారా మంత్రి చర్యలు తీసుకున్నారని,బాలినేని అడ్డ‌గించార‌నే చర్చ బాలినేని వర్గంలో సాగుతుంది. ఈ పరిణామాలతో బాలినేని వర్సెస్ ఆదిమూలపు సురేష్ మధ్య వివాదం తారస్థాయికి చేరింది. ఇదిలా ఉంటే దీన్ని అందిపుచ్చుకున్నటువంటి టిడిపి నాయకులు ప్రకాశం జిల్లాలో పుంజుకునే ప్రయత్నం చేస్తున్నారు.

కొండపి అదేవిధంగా పలు నియోజకవర్గాల్లో టిడిపి నాయకులు పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నారు. మరోవైపు చీరాల ఎమ్మెల్యేగా ఉన్న కరణం బలరామ కృష్ణమూర్తి టిడిపిలోకి మళ్లీ మరోసారి వెళ్తారు అనే ప్రచారం జోరుగా సాగుతుంది. ఆయన వైసీపీ కార్యకర్తలకు దూరంగా ఉంటున్నారు. ఆయన కుమారుడు అద్దంకిలో ప్రచారం చేస్తున్నప్పటికీ అద్దంకిలో టికెట్ ఇస్తారో లేదో అనే ఆలోచన ఉండటంతో మళ్ళీ టిడిపి వైపు చూస్తున్నార‌నే ఆలోచనలో ఉన్నారని దీంతో వైసిపికి అంటీ ముట్ట‌నట్టుగా ఉన్నారని ప్రచారం జరుగుతుంది.

Remove fans from govt offices, it's YCP's symbol' - TeluguZ.com

అదే బాలినేని యాక్టివ్ గా ఉండి ఉంటే చీరాలలో మళ్ళీ ఎటువంటి అపోహలు లేకుండా ఎటువంటి పరిస్థితులేకుండా ఉంటుందని కొందరు అభిప్రాయపడుతున్నారు. బాలినేని వ‌ర్సెస్‌ సురేష్ గొడవల కారణంగా జిల్లా వ్యాప్తంగా కూడా వైసిపి పలుచన‌ పడుతుందని వైసీపీ గెలుపు గుర్రాలకు కూడా అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. మరోవైపు ఇదే ఉమ్మడి ప్రకాశం జిల్లాకు చెందిన గిద్దలూరు లోను అసంతృప్తిరేగుతోంది. గిద్దలూరు ఎమ్మెల్యే అన్న రాంబాబు బాహటంగానే వైసీపీని తిడుతున్నారు.

తనకు మంత్రి పదవి ఇవ్వలేదని కొత్తగా వచ్చిన వారికి ఇచ్చారని కొంతమంది కొత్త వారికి మాత్రమే ప్రాధాన్యం ఇస్తున్నారని ఆయన చెప్తున్నారు. నిజానికి ఈయన కూడా గత ఎన్నికలకు ముందు మాత్రమే వైసిపి లోకి వచ్చారు అయినా కూడా తను జగన్ మోహన్ రెడ్డి తర్వాత అంత మెజారిటీ సంపాదించుకున్నారని చెప్తున్నారు. ప్రకాశం జిల్లా అంతా కూడా వైసిపి పరిస్థితి ఒకంత డోలాయమానంలోనే ఉంది. నాయకుల మధ్య అంత‌ర్గ‌త‌ పోరుతో పాటు మాటలతూటాలు పేలుతూనే ఉన్నాయి. ఇది రాను రాను మరింత ముదిరినట్లు అయితే వచ్చే ఎన్నికల నాటికి టిడిపి పుంజుకోవడం ఖాయమని కచ్చితంగా గెలిచి తీరుతుందని అంటున్నారు.