బిగ్ బ్రేకింగ్‌: ఇళ‌య‌రాజా కుటుంబంలో తీవ్ర విషాదం.. శోక‌సంద్రంలో సినీ ప్ర‌పంచం

గ‌త కొంత‌కాలంగా సినీ ప్ర‌పంచంలో వ‌రుస‌గా విషాదాలు చోటు చేసుకుంటున్నాయి. ఈ క్ర‌మంలోనే సిని ప‌రిశ్ర‌మ‌తో పాటు ఆ రంగంతో అనుబంధం ఉన్న ప్ర‌ముఖులు, ప్ర‌ముఖుల కుటుంబాల‌కు చెందిన వారు ఎవ‌రో ఒక‌రు మృతిచెందుతున్నారు. ఈ క్ర‌మంలోనే ఇప్పుడు లెజెండ్రీ మ్యూజిక్ డైరెక్టర్ ఇళయరాజా కుటుంబంలో పెను విషాదం చోటు చేసుకుంది. ఇళయరాజా అన్న కొడుకు పావళర్ శివన్ (60) మంగళవారం హ‌ఠాత్తుగా మృతి చెందారు.

పావళర్ శివన్ గుండెపోటుతో మరణించినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఇళ‌య‌రాజా అన్న పావళర్ వరదరాజన్ కూడా సంగీత దర్శకుడు. అలాగే ఆయ‌న పాటల రచయిత, గాయకుడు కూడా..! వ‌ర‌ద‌రాజ‌న్ 1973లోనే మృతిచెందారు. ఇప్పుడు ఆయ‌న కుమారుల్లో ఒక‌రు 2020లో కిడ్నీ స‌మ‌స్య‌తో మృతిచెంద‌గా… మ‌రో కుమారుడు శివ‌న్ గుండెపోటుతో అనూహ్యంగా మృతిచెందారు.

Pavalar sivan passes away : இசைஞானி இளையராஜாவின் அண்ணன் மகன் பாவலர் சிவன்  காலமானார்

శివ‌న్ గుండెపోటుతో మంచం మీద నుంచి ప‌డిపోయారు. వెంట‌నే కుటుంబ స‌భ్యులు హాస్ప‌ట‌ల్‌కు త‌ర‌లించ‌గా అప్ప‌టికే మృతిచెందిన‌ట్టు వైద్యులు ధృవీక‌రించారు. ఇక శివ‌న్ మృతితో ఇళ‌యరాజా కుటుంబం తీవ్ర విషాదంలో మునిగిపోయింది. శివన్ మంచి గిటారు వాయిద్యకారుడుగా పేరు తెచ్చుకున్నారు. ఆయన ముందు నుంచి బాబాయ్‌ ఇళయరాజా మ్యూజిక్ టీంలోనే కొనసాగుతూ వచ్చారు.

ప్ర‌స్తుతం పాండిచ్చేరిలో ఉంటున్నారు. ఇక శివ‌న్ మృతిప‌ట్ల ప‌లువురు సినీ ప్ర‌ముఖుల‌తో పాటు ఇండ‌స్ట్రీకి చెందిన వారు త‌మ సంతాపం వ్య‌క్తం చేస్తున్నారు.