బ‌న్నీ క్రేజ్ అరాచ‌కం రా… ‘ పుష్ప 2 ‘ ఆడియో రైట్స్ రేటు వింటేనే గూస్‌బంప్స్ మోత‌…!

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా రష్మిక మందన్న హీరోయిన్ గా సుకుమార్ దర్శకత్వంలో తెర‌కెక్కిన సినిమా పుష్ప‌. 2021 డిసెంబ‌ర్లో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చిన ఈ సినిమా బ‌న్నీ కెరీర్‌లోనే బిగ్గెస్ట్ బ్లాక్‌బ‌స్ట‌ర్ హిట్‌గా నిలిచింది. అస‌లు బాలీవుడ్‌లో ఎలాంటి ప్ర‌మోష‌న్లు లేకుండానే పుష్ప సినిమా ఏకంగా రు. 100 కోట్ల‌కు పైగా వ‌సూళ్లు కొల్ల‌గొట్టింది.

Allu Arjun's New Look From Pushpa 2 Looks Unrecognizable - Bharat Express

ఇప్పుడు పుష్ప‌కు సీక్వెల్‌గా పుష్ప 2 సినిమా వ‌స్తోంది. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై నవీన్ ఏర్నేని, వై రవిశంకర్ నిర్మాతలుగా భారీ బ‌డ్జెట్‌తో రూపొందుతున్న ఈ సినిమాపై నేష‌న‌ల్ లెవెల్లో భారీ అంచ‌నాలు ఉన్నాయి. దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ మూవీ ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుండ‌గా.. వ‌చ్చే యేడాది ఈ సినిమాను రిలీజ్ చేయ‌నున్నారు.

ఇదిలా ఉంటే ఈ క్రేజీ సీక్వెల్‌పై ఓ అదిరిపోయే క్రేజీ న్యూస్ బ‌య‌ట‌కు వ‌చ్చింది. పుష్ప 2 ఆడియో రైట్స్ ఏకంగా రూ. 65 కోట్ల భారీ ధరకు ప్రముఖ మ్యూజిక్ సంస్థ టి సిరీస్ దక్కించుకుంద‌ట‌. ఇదే మ్యాట‌ర్ నిజం అయితే ఇండియ‌న్ సినిమా హిస్ట‌రీలోనే ఇదే పెద్ద రికార్డు అవుతుంద‌ని సినిమా వ‌ర్గాలు లెక్క‌లు వేస్తున్నాయి.

అస‌లు బ‌న్నీ క్రేజ్ ఏ రేంజ్‌లో ఉందో చెప్పేందుకు ఈ ఒక్క‌టి నిద‌ర్శ‌నం. ఫాహాద్ ఫాసిల్, సునీల్, అనసూయ, జగదీశ్ ప్రతాప్ భండారి, ధనుంజయ, రావు రమేష్ తదితరులు కీలక పాత్రల్లో న‌టిస్తున్నారు.