ఓటమి దిశగా వైసీపీ ఫైర్‌బ్రాండ్లు… ఆ ఒక్కడికే ఛాన్స్…!

అధికార వైశేపీలో ఫైర్ బ్రాండ్ నాయకులంతా ఓటమి దిశగా వెళుతున్నారా?గత ఎన్నికల్లో గెలిచి..అధికారంలోకి వచ్చాక ప్రతిపక్ష నేతలని తిట్టిన నేతలు ఈ సారి గెలవడం కష్టమేనా? అంటే ఇప్పుడున్న రాజకీయ పరిస్తితులని గమనిస్తే అది నిజమే అనిపిస్తుంది. అసలు జగన్ పై అభిమానంతో ఆయనపై ఈగ వాలనివ్వకుండా చూస్తూ..ప్రతిపక్ష నేతలు ఏమైనా విమర్శలు చేస్తే..వెంటనే వారికి కౌంటర్లు ఇవ్వడమే కాదు..బూతులు తిడుతూ వారిపై విరుచుకుపడే వైసీపీ ఫైర్ బ్రాండ్ నాయకులు చాలామంది ఉన్నారు.

Kodali Nani Images Hd - 1200x801 Wallpaper - teahub.io

అయితే అలాంటి ఫైర్ బ్రాండ్లు ఇప్పుడు ఓటమి దిశగా వెళుతున్నట్లే కనిపిస్తున్నారు. కేవలం ప్రతిపక్ష నేతలని తిట్టడంపైనే ఫోకస్ పెట్టి..తమ తమ నియోజకవర్గాలని సరిగ్గా పట్టించుకోకపోవడం, పదవులు కోసం మీడియాకెక్కి బూతులు తిట్టడం వల్ల ప్రజల్లో వ్యతిరేకత తెచ్చుకున్నారు. అలా ఓటమి దిశగా వెళుతున్న ఫైర్ బ్రాండ్ నేతల్లో మంత్రి రోజా కూడా ఒకరు. వరుసగా రెండు సార్లు నగరి నుంచి గెలిచిన రోజా..మంత్రిగా ఉన్నారు. ఇక ఈమె..చంద్రబాబు, లోకేష్, పవన్‌లని ఏ విధంగా తిడతారో చెప్పాల్సిన పని లేదు.

MLA Roja : డ‌బ్బుల‌న్నీ పోగొట్టుకున్నా.. పిల్ల‌లు కూడా పుట్ట‌ర‌ని  భ‌య‌ప‌డ్డా.. రోజా సంచ‌ల‌న వ్యాఖ్య‌లు - OK Telugu

అయితే నగరిలో రోజా ఓడిపోయే అవకాశాలు ఎక్కువ ఉన్నాయని తెలుస్తోంది. గ‌త ఎన్నిక‌ల్లో రోజాపై స్వ‌ల్ప తేడాతో ఓడిన టీడీపీ యువ‌నేత గాలి భానుప్ర‌కాష్‌ నాయుడు ఈ సారి ప‌క్కా విజ‌యం అంటున్నారు. వైసీపీ అంత‌ర్గ‌త విబేధాలు కూడా భానుకు బాగా క‌లిసి రానున్నాయి. అటు మరో మంత్రి గుడివాడ అమర్నాథ్ పరిస్తితి కూడా అలాగే ఉందని తెలుస్తోంది. ఈయనపై సోషల్ మీడియాలో కూడా పెద్ద ట్రోల్స్ వస్తున్నాయి. అనకాపల్లిలో ఈయనకు ఈ సారి గెలిచే ఛాన్స్ లేదని తేలింది.

అంబటిపై లంచం ఆరోపణలు-జనసేన వద్దకు బాధితులు-శవాలపై పేలాలు ఏరుకోనన్న మంత్రి | ambati  rambabu demand half compensation as bribe from septic tank death  victim-details - Telugu Oneindia

అలాగే పలాసలో మంత్రి సీదిరి అప్పలరాజు, సత్తెనపల్లిలో అంబటి రాంబాబుల పరిస్తితి కూడా అలాగే ఉంది. ఇటు మచిలీపట్నంలో పేర్ని నాని, ఒంగోలులో బాలినేని శ్రీనివాస్ రెడ్డి, నెల్లూరు సిటీలో అనిల్ కుమార్ యాదవ్ సైతం గెలుపు గుర్రం ఎక్కడం కష్టమని తేలింది. ఇక గుడివాడలో కొడాలి నాని ఒక్కడికే గెలుపు అవకాశాలు కనిపిస్తున్నాయి. మొత్తానికి వైసీపీలో ఫైర్ బ్రాండ్ నాయకులు ఓటమి దిశగా వెళుతున్నారు.

Tags: election survey, intresting news, latest news, latest viral news, social media, social media post, telugu news, Tollywood, viral news, YS Jagan, ysrcp