తార‌క‌ర‌త్న కోసం రాత్రిళ్లు బాల‌య్య అంత‌లా ఏడ్చేవాడా… ఇంత బాధ గుండెల్లో దాచుకున్నాడా…!

నందమూరి తారకరత్న దాదాపు 20 రోజులకు పైగా మృత్యువుతో పోరాడి మృతి చెందారు. తారకరత్న మరణించి సుమారు నెలరోజులు అవుతోంది. ఇప్పటికీ తారకరత్న లేరన్న విషయాన్ని ఎవరు జీర్ణించుకోలేకపోతున్నారు. అటు నందమూరి అభిమానులు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నందమూరి కుటుంబం, కుటుంబాన్ని అభిమానించే కొన్ని కోట్లాదిమంది ఇంకా ఆ షాక్‌ నుంచి బయటకు రాలేదు. తారకరత్న భార్య అలేఖ్య రెడ్డి తీవ్ర విషాదంలో మునిగిపోయారు. తన భర్తను తలుచుకుంటూ ఆమె ఎంత మనోవేదనకు గురవుతున్నారో ? ఆమె సోషల్ మీడియాలో పెడుతున్న పోస్టులే చెప్తున్నాయి.

తాజాగా ఆమె తన భర్త చావు బతుకుల్లో ఉన్నప్పుడు తన చిన్న మామ అయిన నందమూరి బాలకృష్ణ తన భర్తను బతికించుకునేందుకు ఎంత తపన పడ్డారో చెబుతూ.. సోషల్ మీడియాలో తీవ్ర భావోద్వేగంతో పోస్ట్ పెట్టారు. తన భర్త మృతి చెందినప్పటి నుంచి అలేఖ్య రెడ్డి సోషల్ మీడియాలో ఏదో ఒక పోస్ట్ పెడుతూనే వస్తున్నారు. తాజాగా ఆమె బాలయ్య గురించి చెబుతూ మేం కుటుంబం అని పిలిచే ఏకైక వ్యక్తి బాలయ్య ఆయన కష్టసుఖాల్లో మాకు కొండంత రాయిలా అండగా నిలబడ్డార‌ని చెప్పింది.

ఆసుపత్రికి తీసుకు వెళ్లినప్పుడు ఒక తండ్రిలా.. నీ బెడ్ పక్కన కూర్చుని నీకోసం పాట పాడినప్పుడు ఒక అమ్మలా.. నువ్వు రియాక్ట్ అవుతావేమో అని నిన్ను నవ్వించడం కోసం జోకులు వేస్తూ సరదాగా కనిపించారు. ఎవరూ లేని సమయంలో నీకోసం ఆయన ఎంతో కన్నీరు పెట్టుకున్నారు. చివరి క్షణం వరకు నీకోసం చాలా చేశారు. ఓబు ( తారకరత్న ముద్దు పేరు ) నువ్వు మరికొన్నాళ్లు జీవించి ఉంటే బాగుండేది. నిన్ను చాలా మిస్ అవుతున్నాం అంటూ అలేఖ్య రెడ్డి ఎమోషనల్ అయ్యారు.

అలేఖ్య రెడ్డి ఎంతో భావోద్వేగంతో పెట్టిన ఈ పోస్ట్ చూస్తుంటే తారకరత్నను బతికించుకునేందుకు బాలయ్య పడిన కష్టంతో పాటు.. తారకరత్న కోమాలో ఉన్నప్పుడు బాలయ్య ఎంత ఆవేదన చెందారో ?ఎంత బాధపడ్డారో ఎంత దుఖాని తనలో మింగుతున్నారు స్పష్టంగా తెలుస్తోంది. తారకరత్నను కుప్పం నుంచి బెంగళూరు ఆసుపత్రికి తరలించినప్పటి నుంచి ఆయన మృతి చెందటం, అంత్యక్రియలు పెద్దకర్మ పూర్తయ్య వరకు బాలయ్య అంతటా తానే నడిపించారు. అలాగే తారకరత్న కుటుంబానికి తాను అండగా ఉంటానని ఆ పిల్లల బాధ్యత తాను తీసుకుంటున్నానని చెప్పారు. ఏదేమైనా బాలయ్య మనస్తత్వానికి ఇంతకు మించిన ఉదాహరణ అక్కర్లేదు.

Tags: balakrishna, film news, filmy updates, latest news, social media, social media post, Star hero, tarakrathna, telugu news, Tollywood, tollywood news, trendy news