ఆంధ్రప్రదేశ్లో అధికార వైసీపీపై రోజురోజుకు ప్రజా వ్యతిరేకత పెరుగుతుంది. ఇప్పటికే పలు సర్వేలలో ఆ పార్టీపై ప్రజల్లో ఉన్న వ్యతిరేకత స్పష్టంగా కనిపిస్తోంది. గత ఎన్నికలలో ఏకంగా 151 సీట్లతో ఘనవిజయం దక్కించుకుని ముఖ్యమంత్రి పీఠం చేపట్టిన జగన్మోహన్ రెడ్డికి వచ్చే ఎన్నికలకు తొమ్మిది నెలల ముందు నుంచే ఎదురుగాలు భయంకరంగా వీస్తున్నాయి. ఈ క్రమంలోనే రెండు ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాలలో ఆ పార్టీ పరిస్థితి మరి ఘోరంగా ఉన్నట్టు తెలుస్తోంది.
తెలుగుదేశం – జనసేన కలిసి పోటీ చేసినా లేదా విడివిడిగా పోటీ చేసిన కూడా వైసిపి ఫ్యాన్ రెక్కలు విరిగిపోవడం ఖాయమని పలు సర్వేలు చెబుతున్నాయి. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో 19 అసెంబ్లీ సీట్లు, ఉమ్మడి ఉపయోగ గోదావరి జిల్లాలో 15 అసెంబ్లీ సీట్లు ఉన్నాయి. ఈ రెండు జిల్లాల్లో కలిసి మొత్తం 34 అసెంబ్లీ సీట్లు ఉన్నాయి. రాష్ట్రంలో అధికారంలోకి రావాలంటే ఈ రెండు జిల్లాలలో ఎక్కువ సీట్లు వచ్చిన పార్టీదే అధికారం అవుతుంది.
2014 ఎన్నికలలో ఈ రెండు జిల్లాలలో టిడిపి దూసుకుపోయింది. అసలు పశ్చిమ గోదావరి జిల్లాలో వైసిపి బోనీ కొట్టలేదు. ఇక తాజాగా రైజ్ సంస్థ చేసిన సర్వేలో ఈ 34 అసెంబ్లీ సీట్లలో తెలుగుదేశం 15 సీట్లలో క్లీయర్ కట్‌గా విజయం సాధించనుంది. ఇక జనసేన 3 సీట్లలో విజయం సాధించే ఛాన్సులు ఉన్నాయి. వైసీపీకి ఖచ్చితంగా గెలిచే సీట్లు 4 మాత్రమే అట.
ఇక మిగిలిన 12 సీట్లలో టైట్ ఫైట్ నెలకొందని తెలుస్తోంది. దీనిని బట్టే ఈ రెండు జిల్లాల్లో ప్రజా వ్యతిరేకత ఎలా ఉందో తెలుస్తోంది. సింగిల్ గా పోటీ చేసినా కూడా జనసేన పిఠాపురం – నరసాపురం – భీమవరంలో గెలుస్తుందని తేలింది. ఇక టైట్ ఫైట్ ఉన్న సీట్లలో కూడా టీడీపీకి చాలా చోట్ల ఎడ్జ్ కనిపిస్తోంది.