పాలిటిక్స్‌లో గెలుపు ప‌క్కా…. ర‌వితేజ ‘ టైగ‌ర్ నాగేశ్వ‌ర‌రావు ‘ టీజ‌ర్ ( వీడియో )

మాస్ మహారాజ్ రవితేజ నటిస్తున్న పాన్ ఇండియా ప్రాజెక్ట్ టైగర్ నాగేశ్వరరావు. వంశీ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా 1970 కాలంలో స్టువర్టుపురం గజదొంగగా పేరుపొందిన టైగర్ నాగేశ్వరరావు జీవిత చరిత్ర ఆధారంగా రూపొందుతుంది. ఇప్పటికే ఈ సినిమా ఫస్ట్ లుక్ రిలీజై ప్రేక్షకుల్లో మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది.

ఇక కొంతసేపటి క్రితం ఈ సినిమాకు సంబంధించిన టీజర్ రిలీజ్ అయింది. హైదరాబాద్, బాంబే, ఢిల్లీ అనేక నగరాల్లో దారుణంగా దోపిడీలు చేసిన స్టువర్ట్‌పురం దొంగ మద్రాస్ సెంట్రల్ జైలు నుంచి తప్పించుకున్నాడు అంటే సాగే డైలాగ్ తో టీజర్ మొదలైంది. మురళీ శర్మ.. సార్ నాగేశ్వరరావు పాలిటిక్స్ లోకి వెళ్ళుంటే వాడి తెలివితేటలతో ఎన్నికల్లో కచ్చితంగా గెలిచేవాడు, స్పోర్ట్స్ లోకి వెళ్లి ఉంటే పరుగుతో ఇండియాకు మెడల్ తెచ్చేవాడు, ఆర్మీలో ఉంటే ధైర్యంతో యుద్ధమే గెలిచేవాడు అంటూ చేసిన సంభాష‌ణ రవితేజ క్యారెక్టరైజేషన్ పై భారీ అంచనాలు పెంచేస్తుంది.

తెలుగు, హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో రిలీజ్ అవ్వబోతున్న ఈ సినిమా టీజర్ అందర్నీ ఆకట్టుకునే విధంగా ఉంది. ఈ సినిమా అభిషేక్ అగర్వాల్ పై అభిషేక అగర్వాల్ ప్రొడ్యూసర్ గా తెర‌కెక్క‌నుంది. ఈ సినిమా అక్టోబర్ 20న గ్రాండ్ గా ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కావడానికి సిద్ధంగా ఉంది. ఈ సినిమాల్లో రేణు దేశాయ్‌ హేమలత లవన్ అనే కీరోల్‌ ప్లే చేస్తుంది.