చంద్ర‌బాబే రావాలంటోన్న వైసీపీ కేడ‌ర్‌…!

టిడిపి అధినేత చంద్రబాబు కోసం రాష్ట్రవ్యాప్తంగా ఉన్న తెలుగుదేశం శ్రేణులు కదం తొక్కుతున్నాయి. ఇటు నిరాహార దీక్షలు.. అటు ఇతర కార్యక్రమాలు కూడా చేపడుతున్నారు. విచిత్రం ఏంటంటే పార్టీలు, రాజకీయాలతో సంబంధం లేని ప్రజలు కూడా స్వచ్ఛందంగా రోడ్లమీదకు వస్తున్నారు. ఎవరికి వారు మాట్లాడుకుని ర్యాలీలు నిర్వహిస్తున్నారు.

చంద్రబాబు అరెస్టు కొన్ని కొన్నిచోట్ల నిస్తే నిజంగా ఉన్న తెలుగుదేశం కేడర్లో కసి పెంచింది అన్నది వాస్తవం. ఇలాంటి టైం లో ప్రభుత్వం ఎన్ని నిర్బంధాలు పెడుతున్నా.. ఎమర్జెన్సీ తరహాలో ప్రజలను ఎక్కడికక్కడ అడ్డుకుంటున్నా ప్ర‌జ‌లు మాత్రం ఎక్క‌డా వెన‌క్కు త‌గ్గ‌కుండా నిర‌స‌న‌లు చేప‌డుతున్నారు.
రెండు రోజుల కిందట విజయవాడ బెంజ్ సర్కిల్ లో మహిళల పెద్ద ఎత్తున నిరసన తెలిపితే… శనివారం గుంటూరులో నాలుగైదు వేల మంది మహిళలు రోడ్లపైకి వచ్చి నిర‌స‌న తెలిపారు.

అస‌లు మ‌హిళ‌లు కూడా స్వ‌చ్ఛందంగా రోడ్ల మీద‌కు వ‌స్తుండ‌డం ఆశ్చ‌ర్యంగా అనిపిస్తోంది. అస‌లు ఇలా క‌లిసి క‌ట్టుగా బ‌య‌ట‌కు రావ‌డం అనేది ముందుగా కృష్ణా జిల్లా మహిళలు ప్రారంభించారు. మెల్లగా ఇతర నగరాల మ‌హిళ‌లు కూడా రోడ్ల మీద‌కు వ‌చ్చేస్తున్నారు. విచిత్రం ఏంటంటే రాజ‌కీయాలు ప‌ట్ట‌ని సాధార‌ణ మ‌హిళ‌లు, దిగువ‌, మ‌ధ్య త‌ర‌గ‌తి పేద వ‌ర్గాల‌కు చెందిన మ‌హిళ‌లు కూడా స్వ‌చ్ఛందంగా రోడ్ల మీద‌కు వ‌చ్చి బాబు అరెస్టును వ్య‌తిరేకిస్తూ నిర‌స‌న‌లు, ధ‌ర్నాలు చేస్తున్నారు.

గ‌త ఎన్నిక‌ల్లో జై జ‌గ‌న్ అంటూ నినందించిన వైసీపీ మ‌హిళా అభిమానులు కూడా ఈ సారి రోడ్ల మీద‌కు వ‌చ్చి ఈ సారి జ‌గ‌నే గెల‌వాల‌ని అంటుండ‌డం కూడా విశేషం. ఈ అంశంమే ఇప్పుడు ఏపీ రాజ‌కీయ వ‌ర్గాల్లో పెద్ద చ‌ర్చ‌నీయాంశంగా మారింది.