ష‌ర్మిల – విజ‌య‌ల‌క్ష్మి చారిత్ర‌క వెన్నుపోటు అవ‌స‌రం…!

ఎస్ ఇప్పుడు ఏపీ రాజకీయ వర్గాలలో సగటు మనిషిని కదిలించినా ఇదే మాట వినిపిస్తుంది. వైసిపి అధినేత జగన్ తో పాటు ఆ పార్టీ నేతలు పదే పదే టిడిపి అధినేత చంద్రబాబుని ఉద్దేశించి వెన్నుపోటు అని ఊదరగొడుతూ ఉంటారు. చంద్రబాబు ఎన్టీఆర్‌ను నిజంగా వెన్నుపోటు పొడిచారా అన్న ప్రశ్నకు చాలా ఆన్సర్లు ఉన్నాయి. ఆరోజు చంద్రబాబు పార్టీని తన చేతుల్లోకి తీసుకోకపోయి ఉంటే ఇప్పటివరకు కచ్చితంగా తెలుగుదేశం బతికి బట్ట కట్టేది కాదు అన్నది నిజం. తెలుగుదేశం ఎప్పుడో చచ్చిపోయి ఉండేది.

అసలు 1999 ఎన్నికల్లోనే కాంగ్రెస్ విజయం సాధించి ఉండేది. 1995లో కొందరి కబంధహస్తాలలో చిక్కుకుపోయిన తెలుగుదేశం పార్టీని విజయవంతంగా ఆ చెర నుంచి విడిపించిన చంద్రబాబు 26 – 27 సంవత్సరాలుగా పార్టీని విజయవంతంగా నడిపిస్తూ వస్తున్నారు. ఒకవేళ ఆరోజు చంద్రబాబు అసమర్ధుడిగా ఉండి ఉంటే 1999 ఎన్నికల్లో ఘోరఓటమి తర్వాత తెలుగుదేశం కథ‌ ముగిసిపోయి ఉండేది. సరే చంద్రబాబు వెన్నుపోటు సంగతి కాసేపు పక్కన పెడదాం..! మరి ఇప్పుడు తన తల్లి వైయస్ విజయలక్ష్మి, తన చెల్లి వైఎస్ షర్మిల కోసం జగన్ చేసింది ఏమిటి అన్న ప్రశ్నలు కూడా ఉత్ప‌న్నం అవుతున్నాయి.

గత ఎన్నికలలో జగన్ గెలుపు కోసం తల్లి విజయలక్ష్మి చెల్లి షర్మిల ఎంతో త్యాగం చేశారు. నిజం చెప్పాలి అంటే రాజశేఖర్ రెడ్డి మృతి చెందినప్పటి నుంచి ఎలాగైనా అన్నను అధికార పీఠంపై కూర్చో పెట్టాలి అని షర్మిల పగలనకా రాత్రనకా – వాననక ఎండనక – రాయనుక ర‌ప్పనక ఎంతో కష్టపడి కొన్ని రోజులపాటు వందల కిలోమీటర్లు పాదయాత్ర చేశారు. అలాంటి చెల్లి 2014 ఎన్నిక‌ల్లోనే ఒంగోలు ఎంపీ సీటు ఆశిస్తే ఇవ్వ‌లేదు.

త‌ల్లికి వైజాగ్ ఎంపీ టిక్కెట్ ఇస్తే ఆమె ఓడిపోయారు. ఇక గ‌త ఎన్నిక‌ల‌కు ముందు కూడా త‌ల్లి, చెల్లి ఇద్ద‌రూ జ‌గ‌న్ గెలుపు కోసంఎంతో క‌ష్ట‌ప‌డ్డారు. రాష్ట్రం అంతటా కాలికి బ‌ల‌పం క‌ట్టుకుని తిరిగారు. క‌ట్ చేస్తే అధికారంలోకి వచ్చాక వీరిద్ద‌రు ఏమైపోయారు. చివ‌ర‌కు రాజ్య‌స‌భ స‌భ అయినా అన్న ఇవ్వ‌క‌పోడా ? అని ఆశ‌ల‌తో ఎదురు చూసిన ష‌ర్మిల ఆ ప‌ద‌వి కూడా రాద‌ని డిసైడ్ అయ్యాకే అన్న మీద కోపంతో తెలంగాణ‌లో పార్టీ పెట్టారు.

అక్క‌డా ఆమె పార్టీ దిక్కూ మొక్కూ లేకుండా పోయింది. చివ‌ర‌కు కూతురికి జ‌రిగిన అన్యాయంతో పాటు కూతురు క‌ష్టాన్ని చూడ‌లేక తల్లి విజ‌య‌ల‌క్ష్మి వైసీపీ గౌర‌వాధ్య‌క్షురాలి ప‌ద‌వికి సైతం గుడ్ బై చెప్పారు. అంటే త‌న‌ త‌ల్లి, చెల్లికి జ‌రిగిన ఈ అన్యాయాన్ని ఏమంటారో ? ఇది ఎంత వ‌ర‌కు స‌బబో వైసీపీ వాళ్లే చెప్పాలి. ఈ త‌ల్లి, చెల్లి తెలంగాణ‌లో పార్టీ పెడితే ఉపయోగం ఏం ఉంటుంది ? అక్క‌డ రాజ‌కీయాలు చేస్తే ఏం మ‌జా ఉంటుంది… ఏపీలోనే చేయాలి.. ఏపీలోనే తిర‌గాలి.

ష‌ర్మిల తెలంగాణ కోడ‌లిని అని చెప్పుకుంటున్నా… వైఎస్‌. విజ‌య‌ల‌క్ష్మి త‌న బిడ్డ కోసం అక్క‌డ వైఎస్ పాత స్నేహితులు, మిత్రులు, ఆయ‌న అనుచ‌రుల‌తో మీటింగులు పెట్టారు. అలా కాకుండా ఆ త‌ల్లి, ఈ చెల్లి ఇద్ద‌రూ త‌మ‌కు ఇలాంటి ప‌రిస్థితి ఎందుకు వ‌చ్చిందో ? ఏపీలో ఊరూ వాడా తిరిగి చెపితేనే చారిత్ర‌కంగా వెన్నుపోటు అనే ప‌దానికి అస‌లు సిస‌లు నిర్వ‌చ‌నం ఏపీ జ‌నాల‌కు పూర్తిగా అవ‌గ‌త‌మ‌వుతుంది.