వైసీపీ అన్నదమ్ములకు టీడీపీ దెబ్బ.. ఇద్దరికీ ఓటమే..!

గత ఎన్నికల్లో ఓటమికి రివెంజ్ తీర్చుకోవడానికి టీడీపీ రెడీ అవుతుంది..ఎక్కడ కూడా వైసీపీకి ఛాన్స్ ఇవ్వకుండా అదిరిపోయే విజయాన్ని అందుకోవడానికి సిద్ధమవుతుంది. ఇప్పటికే వైసీపీపై వ్యతిరేకత పెరగడం, టి‌డి‌పి బలపడటం కనిపిస్తుంది. అయితే వైసీపీపై వ్యతిరేకత ఏ స్థాయిలో కనిపిస్తుందంటే..చాలా కాలం నుంచి టి‌డి‌పి గెలవని సీట్లలో ఇప్పుడు గెలిచే పరిస్తితి కనిపిస్తుంది.

OurCountry OurStars: KURNOOL MANTRALAYAM YSRCP MLA BALA NAGI REDDY

ముఖ్యంగా టి‌డి‌పికి పట్టు లేని ఉమ్మడి కర్నూలు జిల్లాలో ఈ సారి సత్తా చాటడం ఖాయంగా కనిపిస్తుంది. గత రెండు ఎన్నికల్లో ఈ జిల్లాల్లో టి‌డి‌పి భారీ ఓటమిని మూటగట్టుకుంది. అసలు గత ఎన్నికల్లో ఒక్క సీటు కూడా గెలుచుకోలేదు. అలాంటి జిల్లాలో టి‌డి‌పి ఇప్పుడు ఏడు సీట్లు ఖాయమని తాజా సర్వేలో తేలింది. జిల్లాలో 14 సీట్లు ఉంటే వైసీపీ 7, టి‌డి‌పి 7 సీట్లు గెలుచుకుంటుందని సర్వే స్పష్టం చేసింది. అయితే ఎన్నికల సమయానికి ఈ పరిస్తితి ఇంకా మారే ఛాన్స్ ఉంది. ఇక టి‌డి‌పి జోరు పెరుగుతున్న నేపథ్యంలో వైసీపీకి ఊహించని షాకులు తగిలేలా ఉన్నాయి. ఇదే క్రమంలో జిల్లాలో ఉన్న వైసీపీ అన్నదమ్ములకు టి‌డి‌పి చెక్ పెట్టడం ఖాయమని తెలుస్తోంది. వైసీపీ ఎమ్మెల్యేలుగా ఉన్న బాలనాగిరెడ్డి, సాయిప్రసాద్ రెడ్డి అన్నదమ్ములు అనే సంగతి తెలిసిందే. ఈ ఇద్దరు కర్నూలు జిల్లాలో ఎమ్మెల్యేలుగా ఉన్నారు. ఇక మరో సోదరుడు వెంకట్రామి రెడ్డి అనంతపురం జిల్లా గుంతకల్ ఎమ్మెల్యేగా ఉన్నారు.

My Biography – Sai Prasad Reddy, Adoni Constituency MLA

ఆయన్ని పక్కన పెడితే కర్నూలులో ఎమ్మెల్యేలుగా ఉన్న బాలనాగిరెడ్డి, సాయిప్రసాద్ రెడ్డిలకు ఈ సారి ఓటమి తప్పదని తెలుస్తోంది. గత రెండు ఎన్నికల నుంచి సాయిప్రసాద్ ఆదోని నుంచి గెలుస్తున్నారు. ఇప్పుడు ఆయనపై తీవ్ర వ్యతిరేకత కనిపిస్తుంది. ఆ వ్యతిరేకత ఏ స్థాయిలో ఉందో ఆ మధ్య చంద్రబాబు ఆదోని భారీ రోడ్ షోతో తేలిపోయింది. ఇక 2009లో టి‌డి‌పి నుంచి..2014, 2019 ఎన్నికల్లో వైసీపీ నుంచి మంత్రాలయంలో గెలిచిన బాలనాగిరెడ్డికి ఈ సారి ఓటమి ఖాయమైందని తెలుస్తోంది. లేటెస్ట్ సర్వేల్లో ఆదోని, మంత్రాలయంలో టి‌డి‌పి గెలుపు ఖాయమైంది. మొత్తానికి వైసీపీ అన్నదమ్ములకు టీడీపీ దెబ్బ గట్టిగా తగిలేలా ఉంది.

Tags: AP, ap politics, intresting news, latest news, latest viral news, social media, social media post, tdp, telugu news, trendy news, viral news, ysrcp