భారీ లీడ్‌లోకి టీడీపీ కమ్మ నేతలు.. వైసీపీకి ఇంకా నో ఛాన్స్..!

తెలుగుదేశం పార్టీలో కమ్మ నేతలు వైసీపీపై రివెంజ్ తీర్చుకోవడానికి రెడీ అవుతున్నారు..గత ఎన్నికల్లో దాదాపు చాలామంది కమ్మ నేతలని వైసీపీ ఓడించింది. కానీ ఇప్పుడు రివెంజ్ తీర్చుకునే సమయం వచ్చింది. వరుసపెట్టి కమ్మ నేతలు ఆధిక్యంలోకి వస్తున్నారు. తాము గెలవడంతో పాటు పార్టీని కూడా అధికారంలోకి తీసుకురావడానికి కమ్మ నేతలు పనిచేస్తున్నారు. అన్నీ వర్గాలని కలుపుకుని కమ్మ నేతలు పనిచేస్తున్నారు.

Devineni Uma Maheswara Rao condemns arrest of Dhulipalla Narendra

గత ఎన్నికల్లో జగన్ వేవ్ లో ఓటమి ఎరగని నేతలు సైతం ఓడిపోయిన విషయం తెలిసిందే. అయితే ఈ సారి ఎన్నికల్లో వైసీపీని ఓడించి తమ సత్తా ఏంటో చూపించాలని కమ్మ నేతలు భావిస్తున్నారు. ఇప్పటికే పలువురు నేతలు తమ తమ స్థానాల్లో ఆధిక్యం కనబరుస్తున్నారు. గత ఎన్నికల్లో దెందులూరులో ఓడిపోయిన చింతమనేని ప్రభాకర్..ఈ సారి గెలవడం ఖాయమైంది. అటు ఉంగుటూరులో గన్ని వీరాంజనేయులు, తణుకులో అరిమిల్లి రాధాకృష్ణ సైతం గెలుపు దిశగా వెళుతున్నారు.

జల్లయ్యను ఎమ్మెల్యే కిరాతకంగా చంపించారు: GV Anjaneyulu | GV Anjaneyulu  comments-MRGS-AndhraPradesh

ఇటు వరుసగా నాలుగుసార్లు గెలిచిన దేవినేని ఉమా గత ఎన్నికల్లో మైలవరంలో ఓడిపోయారు..కానీ ఈ సారి మాత్రం అక్కడ దేవినేని గెలుపు ఫిక్స్ అయింది. అలాగే పెనమలూరులో బోడే ప్రసాద్ గెలుపు ఖాయం చేసుకున్నారు. ఇక పొన్నూరులో వరుసగా అయిదుసార్లు గెలిచి ఆరోసారి మాత్రం ఓటమి పాలైన ధూళిపాళ్ళ నరేంద్ర..వైసీపీపై ఈ సారి పక్కాగా రివెంజ్ తీర్చుకోనున్నారు. పొన్నూరులో భారీ మెజారిటీతో గెలిచే అవకాశాలు ఉన్నాయి.

High court permits CBI probe on Yarapathineni

చిలకలూరిపేటలో ప్రత్తిపాటి పుల్లారావు, వినుకొండలో జీవీ ఆంజనేయులు గెలుపు దిశగా వెళుతున్నారు. గురజాలలో యరపతినేని శ్రీనివాసరావు కూడా ఆధిక్యంలోనే ఉన్నారు. మంగ‌ళ‌గిరిలో నారా లోకేష్ భారీ మెజార్టీతో గెల‌వ‌డం ప‌క్కా అంటున్నారు. వీరే కాదు ఇంకా కొందరు కమ్మ నేతలు ఈ సారి ఎన్నికల్లో వైసీపీకి చెక్ పెట్టి పసుపు జెండా ఎగరవేయడం ఖాయమని చాలా స‌ర్వేలు స్ప‌ష్టం చేస్తున్నాయి.

Tags: AP, ap politics, intresting news, latest news, latest viral news, social media, social media post, tdp, telugu news, trendy news, viral news, YS Jagan, ysrcp