అందుకు ఒప్పుకోక‌పోవ‌డంతోనే స్టార్ హీరోల సినిమాల్లో ఛాన్సులు రాలేదు… య‌మున సంచ‌ల‌నం..!

పాత సినిమాల్లో హీరోయిన్ యమున అంటే అప్ప‌ట్లో ఓ సంచ‌ల‌నం. సినిమాల త‌ర్వాత విధి సీరియ‌ల్ చేసిన ఆమె భ‌యంక‌ర‌మైన విల‌నిజాన్ని తెలుగు ప్రేక్ష‌కులు మ‌ర్చిపోరు. తాజాగా ఆమె ఒక ఇంటర్వ్యూలో సినిమా ఛాన్సులు గురించి మాట్లాడుతూ చాలా ఆసక్తికరమైన విషయాలను తెలిపారు. షూటింగ్లో ఏదైనా సమస్య వస్తే ఆమె రెబెల్ గా మారిపోతాన‌ని.. ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు బాలచందర్ నా పేరు రెబల్ అని పెట్టారని చెప్పింది.

Actress Yamuna | Veethi

నేను చేసిన చాలా సినిమాల గురించి ఇప్పటికీ మాట్లాడుతున్నారని.. పుట్టింటి పట్టుచీర సినిమా నేను చేయగా ..అది చిరంజీవి గారి సినిమాకు గట్టి పోటీగా ఆడిందని తెలిపింది. స్టార్ హీరోల సినిమాల్లో నాకు ఛాన్స్ రాకపోవడానికి గ్లామర్ రోల్స్‌ చేయడం తనకు ఇష్టం ఉండకపోవడమే కారణమని చెప్పింది. దానికి తోడు తన కాస్ట్యూమ్స్ కూడా చాలా డల్ గా ఉండేవని.. స్టార్ సినిమాల్లో త‌న‌కు అందువల్లే ఛాన్సులు రాలేదని తెలిపారు.

Yamuna Actress Wiki, Biography, Wikipedia, Age, Height, Husband

ఇక సీనియ‌ర్ డైరెక్ట‌ర్ దాసరి డైరెక్షన్లో తను ఎక్కువ సినిమాలు చేశారని… నేను సినిమా ఇండ‌స్ట్రీలో ఎవరికీ పోటీ ఇవ్వలేదని.. నా ఆలోచనలు అందరికన్నా భిన్నంగా ఉంటాయని య‌మున‌ చెప్పుకొచ్చారు. ఇటీవల సినిమాల్లో ఏ రోల్స్ లోను తాను నటించలేదని.. కేవలం టాక్సీవాలా సినిమాలో మాత్రమే నటించాన‌ని చెప్పుకొచ్చింది య‌మున.

Tollywood Movie Actress Actress Yamuna Biography, News, Photos, Videos | NETTV4U

ఇక సినిమాల కోసం సీరియల్స్ ఆపడం అనేది సాధ్యమైన పని కాదని… ఎమోషన్స్ లేకుండా మనిషి ఉండ‌లేడ‌ని.. అయితే దానిని బ్యాలెన్స్ చేయడం ముఖ్యమని యమున‌ కామెంట్స్ చేసింది. అమ్మాయిలకు నేనెప్పుడూ సపోర్ట్ గా నిలబడతానని కూడా య‌మున తెలిపింది.

Tags: film news, filmy updates, intresting news, latest news, latest viral news, social media, social media post, Star hero, Star Heroine, telugu news, Tollywood, trendy news, viral news, yamuna