టాలీవుడ్లో ఈ స్టార్ హీరోల‌కు ఇంత అవ‌మానం జ‌రిగిందా…!

సినిమా ఇండస్ట్రీలో పేరు తెచ్చుకోవడం అనేది సులభం కాదు. ఎంతో కష్టపడి ఎన్నో బాధలను ఎదుర్కొంటే గాని సినిమా ఇండస్ట్రీలో నిలదొక్కుకోవడం కష్టం. అలాంటి సినిమా ఇండస్ట్రీలో విజయాల బాటలో అడుగు పెట్టాలంటే ఎన్నో రకాల అవమానాలను కష్టాలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. అలా తెలుగు సినిమా హీరోలలో చాలామంది అవమానాలను ఎదుర్కొని పైకి వచ్చిన వారే.ఆ హీరోలు ఎవరో ?తెలుసుకుందాం.

N. T. Rama Rao | Sr NTR's birthday anniversary: A flashback of his film and political foray

 

 

సీనియర్ ఎన్టీఆర్ :

ఎన్టీఆర్ సినిమా ఛాన్సుల‌ కోసం స్టూడియోల చుట్టూ సైకిల్ పై తిరుగుతూ ఎన్నో రోజులు కష్టపడ్డారు. సినిమా ఛాన్స్ దొరికిన తర్వాత కూడా తనకు టిఫిన్ ఎక్కువ పెట్టించాలంటూ నిర్మాతలను బతిమిలాడిన రోజులు ఎన్నో ఉన్నాయి. ఆ తరువాత ఎన్టీఆర్ ఎంత పెద్ద స్టార్ హీరోగా మారారో మనకు తెలిసిందే. ఇలా ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొని సీనియర్ ఎన్టీఆర్ స్టార్డంను సాధించారు.

ANR- Remembering the Titan of Tollywood on his 95th birthday

ఏఎన్ఆర్ :
అక్కినేని నాగేశ్వరరావుది వ్యవసాయ కుటుంబం. అయినా ఆయన సినిమాలపై ఉన్న ఇంట్రెస్ట్ తో సిని రంగంలోనికి అడుగు పెట్టి స్టార్ హీరో అయ్యారు. ఒక సినిమా షూటింగ్ సమయంలో యూనిట్ లో ఒక అసిస్టెంట్ ఆయన్ను అవమానించారట. అప్పుడు ఏఎన్ఆర్ ఐ విల్ కంప్లీట్ యు అని తప్పుగా ఇంగ్లీష్ మాట్లాడాన‌ని నాగేశ్వరరావు స్వయంగా ఒక ఇంటర్వ్యూలో చెప్పారు.

What It's Like To Style Rajinikanth

రజనీకాంత్ :
రజనీకాంత్ మొదట్లో ఆర్టీసీ కండక్టర్ గా పని చేసేవారు. ఆ సమయంలో సినిమా ఛాన్సులు కోసం స్టూడియోల చుట్టూ తిరిగిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. అలా స్టూడియో చుట్టూ తిరిగే సమయంలో ఎవరూ ఆయనను పట్టించుకునేవారు కాదట. ఎన్నో అవమానాలను పడ్డారట. ఈ అవమానాలను భరించలేక రజినీకాంత్ ఒకసారి ఆత్మహత్య చేసుకుందామని ప్రయత్నించారట. అటువంటి రజనీకాంత్ ఈ రోజు సూప‌ర్‌స్టార్‌గా వేలాది మంది అభిమానం సంపాదించుకున్నారు.

Netizens celebrate as Kamal Haasan crosses 6 million mark on Twitter

కమలహాసన్ :
కమల్ హాసన్ కూడా ఇండస్ట్రీలో ఎదగడానికి ఎన్నో కష్టాలు పడ్డారట. ఆయన మొదటి నుంచి ఆర్థికంగా మంచి కుటుంబంలో నుంచి వచ్చిన వారే అయినా సరే సినిమా ఛాన్సులు సంపాదించడానికి ఎన్నో కష్టాలను ఎదుర్కోవాల్సి వచ్చింది. ఆయన మొదట్లో సినిమా ఇండస్ట్రీలో డాన్స్ మాస్టర్ గా పనిచేశారట. మహానటి సావిత్రి భర్త జెమినీ గణేషన్ కి కూడా జెమిని స్టూడియోలో అకౌంటెంట్గా కమల్ హాసన్ పనిచేసిన విషయం అందరికీ తెలుసు.

Why Did Heroines Pressurize Star Hero? | cinejosh.com

శోభన్ బాబు :
శోభన్ బాబు సినిమా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టేముందు తన భార్య, ముగ్గురు పిల్లలతో ఒక చిన్న అద్దె ఇంట్లో ఎన్నో కష్టాలు పడుతూ గడిపే వారట. సినిమా ఛాన్సుల కోసం స్టూడియోలు చుట్టూ తిరిగే సమయంలో ఎన్నో అవమానాలను ఎదుర్కొన్నారట. ఇండస్ట్రీలోకి వచ్చిన మొదట్లో కూడా ఆయన చాలా కష్టాలు పడ్డారని స్వయంగా ఒక ఇంటర్వ్యూలో చెప్పారు.

Tags: film news, filmy updates, intresting news, latest news, latest viral news, social media, social media post, Star hero, Star Heroine, star heros, telugu news, Tollywood, trendy news, viral news