వైనాట్ పులివెందుల‌… జ‌గ‌న్‌పై చంద్ర‌బాబు న‌యా గేమ్ ఇదే..!

టీడీపీ అధినేత చంద్ర‌బాబు రాష్ట్రంలో ప‌ర్య‌టిస్తున్న విష‌యం తెలిసిందే. ఈ క్ర‌మంలో ఆయ‌న ఇటీవ‌లే విశాఖ‌, కృష్ణాజిల్లాల్లో ప‌ర్య‌ట‌న‌లు చేశారు. పార్టీని బ‌లోపేతం చేసే చ‌ర్య‌ల్లో భాగంగా.. ఇదేం ఖ‌ర్మ మ‌న‌రా ష్ట్రానికి నిర్వ‌హిస్తున్నారు. ఇక పార్టీలో ఉన్న అసంతృప్తుల‌ను త‌గ్గించే ప్ర‌య‌త్నం కూడా చేస్తున్నారు. దీంతో పార్టీ దాదాపు పుంజుకుంద‌నే అభిప్రాయం స‌ర్వ‌త్రా వినిపిస్తుండ‌డం గ‌మ‌నార్హం. మ‌రోవైపు.. తాజాగా చంద్ర‌బాబు సీమ‌లో ప‌ర్య‌ట‌న‌కు రెడీ అయ్యారు.

 

సీమ ప్రాంతంలో మూడు రోజుల పాటు చంద్ర‌బాబు ప‌ర్య‌ట‌న చేయ‌నున్నారు. ముఖ్యంగా సీఎం జ‌గ‌న్ సొంత జిల్లా క‌డ‌ప‌లో చంద్ర‌బాబు ప‌ర్య‌ట‌న‌కు ప్రాధాన్యం ఏర్ప‌డింది. క‌డ‌ప‌లోని పులివెందుల నియోజ‌క వ‌ర్గంలో మంగ‌ళ‌వారం చంద్ర‌బాబు ప‌ర్య‌టించేందుకు షెడ్యూల్ రెడీ అయింది. ఈ సంద‌ర్భంగా చంద్ర బాబు ఇక్క‌డ త‌న‌దైన ముద్ర వేయ‌డం ఖాయ‌మ‌ని అంటున్నారు పార్టీ నాయ‌కులు. ఇటీవ‌ల కాలంలో చంద్ర‌బాబు కొత్త నినాదం వినిపిస్తున్నారు.

N. Chandrababu Naidu - Wikipedia

`వైనాట్ పులివెందుల‌` అనే నినాదంతో చంద్ర‌బాబు ప్ర‌సంగాలు చేస్తున్నారు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో సీఎం జ‌గ న్‌ను త‌న సొంత నియోజ‌క‌వ‌ర్గం పులివెందుల‌లోనూ ఓడించి తీరుతామ‌ని.. చంద్ర‌బాబు చెబుతున్నారు. నిజానికి ఈ ప్ర‌య‌త్నం గ‌త ఎన్నిక‌ల‌కు ముందు కూడా జ‌రిగింది. పులివెందుల‌లో మెజారిటీ అయినా త‌గ్గించాల‌ని భావించారు. అయితే.. అప్ప‌ట్లో సాధ్యం కాలేదు. కానీ, ఇప్పుడు మాత్రం త‌న నియోజ‌క‌వ‌ర్గం జోలికి( కుప్పం) వ‌చ్చిన సీఎం జ‌గ‌న్‌కు త‌గిన విధంగా బుద్ధి చెప్పాల‌నేది.. చంద్ర‌బాబు యోచ‌న‌.

YS Jagan Mohan Reddy: Krishna river board biased towards Telangana, claims  AP CM Y S Jagan Mohan Reddy - The Economic Times

ఈ క్ర‌మంలోనే వైనాట్ పులివెందుల నినాదాన్ని హోరెత్తిస్తున్నారు. ఇక‌, ఇప్పుడు పులివెందుల‌లో ప‌ర్య ట‌న ఉన్న నేప‌థ్యంలో రెండు కీల‌క విష‌యాల‌పై టీడీపీ నాయ‌కులు ఆశ‌లు పెట్టుకున్నారు. వ‌చ్చే ఎన్ని క‌ల్లో పులివెందుల టికెట్ ఎవ‌రికి ఇస్తార‌నే విష‌యాన్ని స్ప‌ష్టం చేయ‌డం.. రెండు.. పులివెందుల‌కు ప్ర‌త్యేకంగా హామీలు ఇవ్వ‌డంతోపాటు.. వివేకా కేసులో బ‌ల‌మైన గ‌ళం వినిపించ‌డం ద్వారా.. వైఎస్ సానుభూతిపరుల‌ను.. టీడీపీవైపు మ‌ళ్లించేలా చేయ‌డం. మ‌రి ఈ విష‌యాల్లో చంద్ర‌బాబు ఎలా ముందుకు సాగుతారో చూడాలి.

Tags: ap politics, chandrababu, intresting news, latest news, latest viral news, social media, social media post, tdp, telugu news, trendy news, viral news, ycp, YS Jagan