WTC FINAL 2023 : డ‌బ్ల్యూటీసీ ఫైన‌ల్‌లో టీం ఇండియా అట్ట‌ర్‌ప్లాప్‌..మ‌నోళ్లు ఐపీఎల్ పులులేగా..!

మొత్తానికి ఐపీఎల్ మెరుగుల మోజులో టీం ఇండియా మ‌రోసారి అట్ట‌ర్ ప్లాప్ అయ్యింది. మ‌న‌వాళ్లు ఐపీఎల్ పులులు అన్న విష‌యం మ‌రోసారి ఫ్రూవ్ అయ్యింది. కేవ‌లం ధ‌నార్జ‌న‌కు, డ‌బ్బుల గ‌ల‌గ‌ల‌గా పేరున్న ఐపీఎల్లో మ‌నోళ్లు దుమ్మురేపుతున్నా అంత‌ర్జాతీయ మ్యాచ్‌ల్లో మాత్రం చేతులెత్తేస్తోన్న ప‌రిస్థితి. 2019 ప్ర‌పంచ‌క‌ప్ సెమీఫైన‌ల్లోనే మ‌నోళ్లు ఘోరంగా చేతులు ఎత్తేశారు.

ఇక డ‌బ్ల్యూటీసీ ప్ర‌పంచ‌క‌ప్ ఫైన‌ల్లో ఆస్ట్రేలియాతో తొలి రోజే మ‌నోళ్లు చేతులు ఎత్తేశారు. ముందు త్వ‌ర‌గా మూడు వికెట్లు ప‌డ‌గొట్టి ఆధిప‌త్యం చాటినా ఆ త‌ర్వాత మ‌న బౌల‌ర్లు పూర్తిగా చేతులు ఎత్తేశారు. దీంతో ఆస్ట్రేలియా బ్యాట్స్‌మెన్స్ వీర‌విహారం చేసేశారు. స్టీవెన్ స్మిత్‌, హెడ్ ఇద్ద‌రూ సెంచ‌రీల‌తో క‌దం తొక్కారు. దీంతో ఆస్ట్రేలియా ఏకంగా 469 ప‌రుగుల స్కోరు చేసింది. సిరాజ్ 5 వికెట్లు ప‌డ‌గొట్టాడు.

ఇక రెండో రోజు ఫ‌స్ట్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసిన టీం ఇండియా ఆట ముగిసే టైంకు 5 వికెట్ల‌కు 151 ప‌రుగులు చేసింది. టాప్ ఆర్డ‌ర్ ఘోరంగా కుప్ప‌కూలిపోయింది. మిడిల్ ఆర్డ‌ర్ కూడా చేతులు ఎత్తేసింది. రోహ‌త్ 15, గిల్ 13, పూజారా 14, కోహ్లీ 14 ప‌రుగులు చేయ‌గా.. జ‌డేజా 48 ప‌రుగులు చేసి అవుట్ అయ్యారు.

Test Cricket | In challenges, Virat Kohli discovers cricket's beauty - Telegraph India

ప్ర‌స్తుతం ర‌హానే 29, శ్రీక‌ర్ భ‌ర‌త్ 5 ప‌రుగుల‌తో క్రీజ్‌లో ఉన్నారు. ఇంకా ఇండియా 318 ప‌రుగులు వెన‌క‌బ‌డి ఉంది. మ‌రో 118 ప‌రుగులు చేస్తేనే ఫాల్ ఆన్ గండం నుంచి గ‌ట్టెక్కుతుంది. ఏదేమైనా ఐపీఎల్‌, స్వ‌దేశంలో రెచ్చిపోయే టీం ఇండియా మ‌రోసారి కీల‌క మ్యాచ్‌లో చేతులు ఎత్తేసింది.