స్వీటీ అనుష్కకు ఇన్ని కోట్ల ఆస్తులా… ఎక్క‌డెక్క‌డ ఏయే ఆస్తులో చూడండి..!

టాలీవుడ్ స్వీటీ బ్యూటీ అనుష్క టాలీవుడ్‌లో 17 సంవత్స‌రాలుగా హీరోయిన్‌గా కొన‌సాగుతోంది. అక్కినేని నాగార్జున – పూరి జగన్నాథ్ కాంబినేషన్లో 2005లో వచ్చిన సూపర్ సినిమాతో ఆమె తెలుగు తెర‌కు హీరోయిన్‌గా పరిచయమైంది అనుష్క శెట్టి. ఆ త‌ర్వాత కోడి రామ‌కృష్ణ ద‌ర్శ‌క‌త్వంలో వ‌చ్చిన అరుంధతి సినిమాతో టాలీవుడ్ లో టాప్ హీరోయిన్‌గా మారిపోయింది. ఈ సినిమా త‌ర్వాత ఆమె స్టార్ హీరోల‌తో స‌మాన‌మైన క్రేజ్ తెచ్చుకుంది.

Anushka Shetty - Wikipedia

అరుంధ‌తి త‌ర్వాత అనుష్క లేడీ ఓరియెంటెడ్ సినిమాల‌కు కేరాఫ్ అడ్ర‌స్‌గా మారిపోయింది. 15 సంవత్సరాలుగా అనుష్క ఎన్నో సినిమాల్లో న‌టిస్తూ కోట్లాది రూపాయ‌ల ఆస్తులు కూడ‌బెట్టుకుంది. ఆమెకు ఇన్నేళ్ల‌లో సంపాదించిన ఆస్తుల మొత్తం విలువ‌ల రు. 300 కోట్ల వ‌ర‌కు ఉంటుంద‌ట‌. ఆమె హైద‌రాబాద్‌, వైజాగ్‌తో పాటు బెంగ‌ళూరు రియ‌ల్ ఎస్టేట్‌లో భారీగా పెట్టుబ‌డులు పెట్టిందంటారు.

వైజాగ్‌లోనూ, అమ‌రావ‌తిలోనూ త‌న బెస్ట్ ఫ్రెండ్ అయిన సీనియ‌ర్ హీరో నాగార్జున‌తో క‌లిసి భారీగా పెట్టుబ‌డులు పెట్టింది. ఇక ఆమె సొంత రాష్ట్రం బెంగ‌ళూరు, మంగ‌ళూరులోనూ ఆమె రియ‌ల్ ఎస్టేట్ పెట్టుబ‌డులు పెట్టారు. ఇక హైద‌రాబాద్‌, బెంగ‌ళూరు, చెన్నై, మంగ‌ళూరులో ఆమెకు విలువైన ప్లాట్లు, ఖ‌రీదైన బంగ‌ళాలు ఉన్నాయి. వీటి విలువ మొత్తం లెక్కిస్తే ఆమె ఆస్తులు రు. 500 కోట్ల‌కు పైనే ఉంటుందంటారు.

Anushka Shetty Public Appearance: Anushka Shetty makes public appearance at  temple after long hiatus - The Economic Times

ఇక అనుష్క త‌న కారు డ్రైవ‌ర్ పుట్టిన రోజు కానుక‌గా 12 ల‌క్ష‌ల విలువైన కారును గిఫ్ట్‌గా ఇచ్చి స‌ర్‌ప్రైజ్ చేసింద‌ట‌. టైమ్స్ నౌ వెల్ల‌డించిన అనుష్క ఆస్తుల వివ‌రాల ప్ర‌కారం ఆమె ఇంటి ఖ‌రీదే రు. 12 కోట్ల‌కు పైనే ఉంటుంద‌ట‌. ఇక ఆమె వాడే కారుల్లో టొయోటా కొరొల్లా ఆల్టిస్ -21ల‌క్ష‌లు – ఆడీ ఏ 6 కారు విలువ రు. 56 ల‌క్షలు ఉంటుంది. అలాగే ఆడి క్యూ 5 విలువ రు. 62 ల‌క్ష‌లు, బీఎండ‌బ్ల్యూ 6 సిరీస్ కార్ 67ల‌క్ష‌లు ఉంటుంది. ఇక మార్కెట్లో ఎప్పుడు కొత్త కారు వ‌చ్చినా ఆమె ముందే కొంటుంది.

ఇక ఆమె హీరోయిన్ కావ‌డానికి ముందే యోగా టీచ‌ర్‌గా ఉన్న‌ప్పుడు, ఫ్యాష‌న్ వ‌ర‌ల్డ్ లో మోడ‌లింగ్ చేసిన‌ప్పుడు కూడా బెంగ‌ళూరులో చిన్న చిన్న ఆస్తులు కూడ‌బెట్టింది. వీటి విలువ ఇప్పుడు కోట్ల‌లోనే ఉంటుందంటున్నారు. ఏదేమైనా అనుష్క ఇన్నేళ్ల‌లో బాగానే ఆస్తులు సంపాదించింది.