బ్లాక్‌బ‌స్ట‌ర్ సినిమా సీక్వెల్లో విజ‌య్‌దేవ‌ర‌కొండ‌… హీరోయిన్‌, డైరెక్ట‌ర్ కూడా ఫిక్స్‌…!

ప్రస్తుతం మన టాలీవుడ్ యంగ్ హీరో సెన్సేషనల్ స్టార్ విజయ్ దేవరకొండ ఫుల్ స్వింగ్‌లో దూసుకు పోతున్నాడు. విజ‌య్ న‌టించిన సినిమాలు హిట్‌, ప్లాప్‌ల‌తో సంబంధం లేకుండా తిరుగులేని క్రేజ్‌తో దూసుకు పోతున్నాడు. విజ‌య్ న‌టించిన గీత‌గోవిందం త‌ర్వాత మ‌నోడికి స‌రైన హిట్ ప‌డ‌లేదు. అయినా విజ‌య్ వ‌రుస‌గా భారీ బ‌డ్జెట్ సినిమాల్లో న‌టిస్తున్నాడు.

Watch Geetha Govindam Full HD Movie Online on ZEE5

గ‌తేడాది పూరి జ‌గ‌న్నాథ్ ద‌ర్శ‌క‌త్వంలో లైగ‌ర్ లాంటి భారీ పాన్ ఇండియా సినిమా చేసినా పెద్ద డిజాస్ట‌ర్ అయ్యింది. ప్ర‌స్తుతం విజ‌య్ ఖుషి సినిమాలో న‌టిస్తున్నాడు. సీనియ‌ర్ స్టార్ హీరోయిన్ స‌మంత న‌టిస్తోన్న ఈ సినిమాకు శివ నిర్వాణ ద‌ర్శ‌కుడు. ప‌క్కా క్లాసిక‌ల్ ల‌వ్ స్టోరీగా తెర‌కెక్కుతోన్న ఈ సినిమా సెప్టెంబ‌ర్ 1న ప్రేక్ష‌కుల ముందుకు రానుంది.

అయితే ఇప్పుడు విజ‌య్ మ‌రో క్రేజీ కాంబినేష‌న్లో తెర‌కెక్కే సినిమాకు కూడా ఓకే చెప్పేశాడు. గీతాగోవిందం సినిమాతో విజ‌య్‌కు కెరీర్‌లోనే మ‌ర్చిపోలేని బ్లాక్‌బ‌స్ట‌ర్ ఇచ్చిన ప‌ర‌శురాం పెట్లతో విజ‌య్ మ‌రోసారి క‌లిసి ప‌ని చేస్తున్నాడు. ప‌ర‌శురాం గ‌తేడాది మ‌హేష్‌బాబుతో స‌ర్కారువారి పాట సినిమా తెర‌కెక్కించి హిట్ కొట్టాడు. ఈ సినిమా త‌ర్వాత చాలా లాంగ్ గ్యాప్ తీసుకున్న ప‌ర‌శురాం ఇప్పుడు విజ‌య్ కోసం అదిరిపోయే క‌థ రెడీ చేసిన‌ట్టుగా తెలిసింది.

Kushi - Official Motion Poster | Telugu Movie News - Times of India

ఇది గీతాగోవిందం సినిమాకు సీక్వెల్‌గా వ‌స్తుందంటున్నారు. ఈ సినిమాలో హీరోయిన్ గా స్టార్ హీరోయిన్ పూజా హెగ్డే ఫస్ట్ ఛాయిస్ గా ఉన్నట్టుగా తెలుస్తోంది. విజయ్ స్వ‌యంగా ఈ సినిమా కోసం పూజా హెగ్డే పేరును సూచించిన‌ట్టుగా తెలుస్తోంది. ఏదేమైనా ఈ కాంబినేష‌న్ చాలా ఇంట్ర‌స్టింగ్‌గా ఉంది. దీనిపై త్వ‌ర‌లోనే అధికారిక ప్ర‌క‌ట‌న రానుంది.