శోభ‌న్‌బాబు సినిమాలో ఛాన్స్ వ‌స్తే వాణిశ్రీ అంత త్యాగం చేసేవారా…. షాకింగ్ రీజ‌న్‌..!

కొన్నికొన్ని విష‌యాలు ఆశ్చ‌ర్యంగాను, ఆస‌క్తిగాను ఉంటాయి. సినీ రంగంలో అయితే మ‌రిన్ని ఎక్కువ‌గా ఉంటాయి. కొంద‌రు హీరోలు-కొంద‌రు హీరోయిన్లు.. క‌నెక్ట్ అయిపోతారు. హీరోయిన్ల కోసం.. హీరోలు, హీరోల కోసం.. హీరోయిన్లు కూడా అనేక సంద‌ర్భాల్లో స‌మ‌యాన్ని వెచ్చించ‌డ‌మే కాదు.. త‌మ రెమ్యూన‌రేష‌న్ కూడా వ‌దులుకున్న‌వారు ఉన్నారు. ఇలా.. బ్లాక్ అండ్ వైట్ సినిమాల‌ను ప‌రిశీలిస్తే.. చాలా మంది క‌నిపిస్తారు.

Shobhan Babu & Vanisri Emotional Love Scene

జ‌య‌ల‌లిత‌-ఎంజీఆర్ క‌లిసి న‌టించిన సినిమాలుచాలానే ఉన్నాయి. ఎంజీఆర్‌తో న‌టించేందుకు జ‌య‌ల‌లిత‌.. రెమ్యూన‌రేష‌న్ చాలా త‌గ్గించుకున్నారు కూడా. ఎంజీఆర్‌తో న‌టించాల‌నే కోరిక ఒక్క‌టే ఇక్క‌డ కార‌ణం. ఇలా.. నాలుగైదు సినిమాల్లో త‌న రెమ్యూన‌రేష‌న్ త‌గ్గించుకుని మ‌రీ ఎంజీఆర్‌తో క‌లిసి న‌టించారు జ‌య‌ల‌లిత‌. అదేవిధంగా కేఆర్ విజ‌య కూడా.. దేవీ పాత్ర‌లు వ‌స్తే.. అస‌లు రెమ్యున‌రేష‌న్ తీసుకునేవారు కాద‌ట‌.

ఆ పాత్ర‌లు రావ‌డ‌మే అదృష్టం అని ఆమె రెమ్యున‌రేష‌న్ గురించి పెద్ద‌గా స్పందించ‌కుండా. పాత్ర‌ల్లో జీవించ‌డానికి ఇష్ట‌ప‌డేవారు. ఇలా.. కొంద‌రు రెమ్యున‌రేష‌న్ విష‌య‌లో ప‌ట్టు విడుపుల‌తో వ్య‌వ‌హ‌రించిన సంద‌ర్భాలు ఉన్నాయి. ఇలానే హీరో శోభ‌న్‌బాబు అంటే.. ఇష్ప‌ప‌డే వారు చాలా మంది ఉన్నారు. వాణి శ్రీ నుంచి అప్ప‌టి హీరోయిన్ శార‌ద వ‌ర‌కు .. దాదాపు న‌లుగురైదుగురు హీరోయిన్లు.. శోభ‌న్‌బాబును ఇష్ట‌ప‌డేవారు.

Evandi Aavida Vachindi Movie || Hattukomannadi Video Song || Shobhan  Babu,Vani Sri,Sarada - YouTube

వీరిలో వాణిశ్రీ, శార‌ద‌లు మ‌రీ ఎక్కువ‌గా పోటీ ప‌డేవారు. శోభ‌న్‌బాబుతో క‌లిసి న‌టించేందుకు వారు ఎంతో ఇష్ట‌ప‌డేవారు. మాన‌వుడు దాన‌వుడు సినిమాలో పోటీ వ‌స్తే.. ఇద్ద‌రూ కూడా రెమ్యున‌రేష‌న్ త‌గ్గించుకుని మ‌రీ ముందుకు రావ‌డం గ‌మ‌నార్హం. ఇలా.. అనేక సినిమాల్లో శోభ‌న్‌బాబు కోసం రెమ్యున‌రేష‌న్‌ను వాణిశ్రీ త‌గ్గించుకుంద‌ని అంటారు.