ఎన్టీఆర్ 30 టైటిల్‌పై పూన‌కాలు లోడింగ్‌… ఫ్యీజులు ఎగిరే న్యూస్‌..!

టాలీవుడ్ యంగ్‌టైగ‌ర్ ఎన్టీఆర్ త్రిబుల్ ఆర్ సినిమాతో త‌న కెరీర్‌లో వ‌రుస‌గా ఆరో హిట్ త‌న ఖాతాలో వేసుకున్నాడు. టాలీవుడ్‌లో ఇప్పుడున్న యంగ్ హీరోల్లో ఏ హీరోకు కూడా వ‌రుస‌గా ఆరు హిట్లు లేవు. ఇలాంటి అరుదైన రికార్డ్ కేవ‌లం ఎన్టీఆర్‌కు మాత్ర‌మే ఉంది. త్రిబుల్ ఆర్ త‌ర్వాత యేడాది పాటు లాంగ్ గ్యాప్ తీసుకున్న ఎన్టీఆర్ ప్ర‌స్తుతం కొర‌టాల శివ ద‌ర్శ‌క‌త్వంలో త‌న కెరీర్ 30వ సినిమాలో న‌టిస్తున్నాడు. ఈ సినిమా త‌ర్వాత కేజీయ‌ఫ్ డైరెక్ట‌ర్ ప్ర‌శాంత్ నీల్ ద‌ర్శ‌క‌త్వంలోనూ 31వ సినిమా చేస్తున్నాడు.

 

ఈ రెండు ప్రాజెక్టులు కూడా పాన్ ఇండియా లెవ‌ల్లోనే తెర‌కెక్కుతున్నాయి. ఈ సినిమాలో బాలీవుడ్ ముద్దుగుమ్మ జాన్వీక‌పూర్ హీరోయిన్‌? అలాగే రెండో హీరోయిన్ పాత్ర‌కోసం ద‌ర్శ‌కుడు కొర‌టాల మ‌రో బాలీవుడ్ ముద్దుగుమ్మ అన‌న్య‌పాండేను తీసుకున్నార‌ని కూడా టాక్ ? ఇక సైఫ్ ఆలీఖాన్ ఈ సినిమాలో విల‌న్‌గా న‌టిస్తోన్న సంగ‌తి తెలిసిందే.

తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఓ క్రేజీ అప్‌డేట్ ఇప్పుడు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది. ఈ నెల 20న ఎన్టీఆర్ బ‌ర్త్ డే కానుక‌గా ఈ సినిమా నుంచి ఓ క్రేజీ అప్‌డేట్ వ‌ద‌లుతున్నార‌ట‌. ఈ సినిమా టైటిల్‌తో పాటు ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్ కూడా అదే రోజు రివీల్ చేసి ఎన్టీఆర్ ఫ్యాన్స్‌కు తిరుగులేని బంప‌ర్ గిఫ్ట్ ఇవ్వ‌బోతున్నార‌ట‌.

ఇక అదే రోజు ఎన్టీఆర్ బ్లాక్‌బ‌స్ట‌ర్ సింహాద్రి సినిమాను రీ రిలీజ్ చేస్తున్నారు. ఇలా ఒకే రోజు ఎన్టీఆర్ ఫ్యాన్స్‌కు రెండు బంప‌ర్ బ‌ర్త్ డే గిఫ్ట్‌లు రానున్నాయి. ఇక తాజాగా కొర‌టాల సినిమా విష‌యానికి వ‌స్తే ఈ సినిమా షూటింగ్ హైద‌రాబాద్‌లో జ‌రుగుతుండ‌గా.. ఇందులో సైఫ్ ఆలీఖాన్‌తో పాటు జాన్వీక‌పూర్ కూడా న‌టిస్తున్నారు.