20 ఏళ్ల‌కే ఏ టాలీవుడ్ హీరోకు లేని రికార్డ్ తార‌క్‌కే… ఎవ్వ‌రూ బీట్ చేయ‌లేరుగా…!

యంగ్ టైగర్ ఎన్టీఆర్.. నందమూరి నట వారసుడిగా సినిమా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టి తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నాడు. ఎన్టీఆర్ తన నటనతో తాతకు తగ్గ మనవడిగా ప్రేక్షకులు అందరినీ మెప్పించాడు. ఎన్టీఆర్ కి ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ తెలిసిందే. నిన్న మొన్నటి వరకు సౌత్ లో మాత్రమే ఫ్యాన్స్ ఉండే ఎన్టీఆర్‌కి త్రిబుల్ ఆర్ సినిమాతో నేష‌న‌ల్ వైడ్‌గా ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగిందని చెప్పొచ్చు. ఎన్టీఆర్ త్రిబుల్ ఆర్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ గా గుర్తింపు తెచ్చుకున్నాడు.

Jr NTR Birthday Special: What Is Your Favourite Jr NTR's Movie? Vote Now | Telugu Filmnagar

ఎన్టీఆర్ ఇప్ప‌టివ‌ర‌కు న‌టించిన సినిమాలో కొన్ని ఫ్లాప్ సినిమాలు ఉన్నా చాలా హిట్ సినిమాల్లోనే నటించాడు ఎన్టీఆర్. తన డాన్స్ తో, యాక్టింగ్ తో అందరినీ ఆకర్షించిన ఎన్టీఆర్.. ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో NTR 30 సినిమాతో బిజీగా ఉన్నాడు. రాజమౌళితో సినిమా తీసిన తర్వాత ఎవరితో సినిమా తీసినా ఫ్లాప్ అనే బ్యాడ్‌ సెంటిమెంట్లు తప్పు అని నిరూపించే ప్రయత్నంలో ఉన్నాడు ఎన్టీఆర్.

ఎన్టీఆర్ కెరియర్ స్టార్టింగ్ లో కేవలం రు. 2 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన సినిమా రు. 22 కోట్ల గ్రాస్ వ‌సూళ్ళు సాధించింది. ఇంతకీ ఆ సినిమా ఏంటి..? అనుకుంటున్నారా అదే వివి వినాయక్ దర్శకత్వంలో ఎన్టీఆర్ కథానాయకుడుగా తెరకెక్కిన ఆది. ఈ సినిమా కేవలం రు. 2 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కి రు. 22 కోట్ల కొల‌గొట్టి సంచలన‌ రికార్డులు సాధించింది. మొదట్లో వినాయక్‌ ఎన్టీఆర్ కి ఒక ప్రేమ కథను చెప్పారట.

aadi cinema teluguCheap Sell-OFF64%

ఆ ప్రేమ కథ ఎన్టీఆర్ కు బాగా నచ్చినప్పటికీ.. ఆయన ఇండస్ట్రీలోకి కొత్త కావడంతో కొంతమంది పెద్దల‌ సలహా మేరకు వివి వినాయక్‌ని ఒక మాస్ కథ రాయమని అడిగారట. వినాయక్ దగ్గర అప్పుడు మాస్ కథ‌ లేకపోవడంతో తను అంతకుముందు రాసుకున్న కేవలం రెండు సన్నివేశాలు మాత్రమే ఎన్టీఆర్ కి చెప్పగా ఎన్టీఆర్ కి ఆ రెండు సన్నివేశాలు బాగా నచ్చడంతో ఆ కథను మొత్తం కంప్లీట్ చేయమని చెప్పాడట.

అలా వినాయక్ కథ‌ మొత్తం పూర్తిగా రాసుకుని వెళ్లి వినిపించగా ఎన్టీఆర్ కి బాగా నచ్చడంతో ఆ సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట. ఈ సినిమా 2002 లో రిలీజై ఎన్టీఆర్ ను స్టార్ హీరోగా మార్చడమే కాక వివి వినాయక్ కి స్టార్ డైరెక్టర్ గా గుర్తింపు తెచ్చి పెట్టింది. ఇలా 20 ఏళ్ల‌కే 98 కేంద్రాల్లో 100 రోజుల సినిమాతో పాటు రు. 22 కోట్ల వ‌సూళ్లు సాధించిన ఘ‌న‌త ఏ టాలీవుడ్ హీరోకు కూడా లేదు.