చంద్ర‌యాన్ 3 గెలుపుపై ప్ర‌పంచ మీడియా బ్ర‌హ్మ‌ర‌థం.. భార‌త్ జ‌య‌హోః అన్న పాక్ మీడియా..!

చంద్రుడి దక్షిణ ధ్రువంపై భారత విజయవంతంగా దిగటాన్ని ప్రపంచ దేశాలు అద్భుతంగా కీర్తించాయి. ఇంటర్నేషనల్ మీడియా సైతం భారతను ప్రశంసలతో ముంచెత్తింది. అసాధ్యాన్ని సుసాధ్యం చేసిన తొలిదేశం గా భారత నిలిచిపోవటాన్ని కొనియాడుతూ అమెరికాతో సహా అనేక దేశాల ప్రధాన పత్రికలు అన్ని పతాక శీర్షికలతో గురువారం ప్రముఖంగా కథనాలు ప్రచురించాయి. ఇవి భారత్‌కు మహాత్ర క్షణాలని పొగిడాయి.

భారతదేశ శక్తి సామర్ధ్యాలపై అనుమానాలు వ్యక్తం చేస్తూ గతంలో మంగళయాన్ మిషన్ ను ఉద్దేశించి వ్యంగ్యంగా కార్టూన్ ప్రచురించిన న్యూయార్క్ టైమ్స్ సైతం భారత్ కి ఇది గొప్ప విజయం అంటూ కితాబు ఇచ్చింది. ఇక వాషింగ్టన్ పోస్ట్ రెండు కథనాలతో పాటు మరో వ్యాసం ప్రచురించింది. చంద్రుడు పైకి భారత్ చేరుకుందని ది వాల్ స్ట్రీట్స్‌ జర్నల్.. చంద్రుడు దక్షిణ ధ్రువం పై భారత్ చారిత్రాత్మక ల్యాండింగ్ చేసిందని బిబిసి – 21వ శతాబ్దంలో చైనా తర్వాత చంద్రుడిపై అడుగుపెట్టిన రెండో దేశంగా భారత్ అవతరించిందని సిఎన్ఎన్ తమ కథనాల్లో ప్రచురించాయి.

ఇక ఈ మిషన్ లో తాము భాగస్వాములు కావటం గర్వకారణం అని అమెరికా ఉపాధ్యక్షురాలు కమలహారిస్ అన్నారు. మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల‌ – గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ కూడా అభినందనలు తెలిపారు. విచిత్రం ఏంటంటే ఇస్రో విజయాన్ని పాకిస్తాన్ మీడియా కూడా ఆకాశానికి ఎత్తేసింది. పాకిస్థాన్లోని ప్రసారం మాధ్యమాలు భారత్ విజయం పై విస్తృతంగా కవరేజ్ ఇచ్చాయి. ప్రధానిని, ఇస్రోను, భారత ప్రజలను అభినందిస్తూ శ్రీలంక అధ్యక్షుడు విక్రమసింగే ప్రకటన విడుదల చేశారు.

అలాగే బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా కూడా ఇస్రో విజయాన్ని కొనియాడారు. ఇక అమెరికాతో పాటు ఇంతకుముందు ఎవరూ చేయని విధంగా దక్షిణ ద్రవంపై ల్యాండర్‌ను ఇస్రో దింపింది ఇది మరింత మధురమైన విజయం అని ది గార్డియన్ పత్రిక ప్రచురించింది. ఏది ఏమైనా భారత విజయాన్ని ప్రపంచ దేశాలు ఒక రేంజ్ లో కీర్తిస్తున్నాయి.