‘ బెదురులంక 2012 ‘ రివ్యూ… కామెడీతో మంచి మెసేజ్‌

టైటిట్‌: ‘ బెదురులంక 2012 ‘

నటీనటులు : కార్తికేయ గుమ్మకొండ, నేహా శెట్టి, అజయ్ ఘోష్, రాజ్ కుమార్ కసిరెడ్డి, శ్రీకాంత్ అయ్యంగార్, ‘ఆటో’ రాంప్రసాద్, గోపరాజు రమణ, ఎల్బీ శ్రీరామ్, ‘స్వామి రారా’ సత్య, ‘వెన్నెల’ కిశోర్ తదితరులు
ఛాయాగ్రహణం : సాయి ప్రకాష్ ఉమ్మడిసింగు, సన్నీ కూరపాటి
సంగీతం : మణిశర్మ
సమర్పణ : సి. యువరాజు
నిర్మాత : రవీంద్ర బెనర్జీ (బెన్నీ) ముప్పానేని
రచన, దర్శకత్వం : క్లాక్స్
విడుదల తేదీ: ఆగస్టు 25, 2023

కథ : యుగాంతం వస్తుందా? ప్రపంచం అంతం అవుతుందా? అని ఓ టీవీ ఛానల్ లో ఒకటే వార్తలు.. దాంతో డిసెంబర్ 21కి మూడు వారాలు ముందు బెదురులంక గ్రామంలో భూషణం(అజయ్ ఘోష్) ఓ నాటకానికి తెర తీస్తాడు. బ్రహ్మం (శ్రీకాంత్ అయ్యంగర్), డేనియల్ (ఆటో రాంప్రసాద్)తో ఆ ఊరి ప్రజల డబ్బును దొంగలించాలని ఓ నాటకానికి తెర లేపుతాడు. ఇక దానికి ఆ ఊరి ప్రెసిడెంట్(గోపరాజు రమణ) ని ఆసరాగా చేసుకుంటూ.. భూషణం అండ్ కో ఆటలకు హీరో శివ (కార్తికేయ గుమ్మకొండ) ఎలా అడ్డుకట్ట వేశాడు? వారికి ఎలా బుద్ధి చెప్పాడు? ప్రెసిడెంట్ కూతురు చిత్ర(నేహా శెట్టి)తో అతని ప్రేమకథ ఏమిటి అనేది థియేటర్లోనే చూడాలి.

ఎవరెలా చేశారంటే:
ఇలాంటి పాత్రులైన జీవించేస్తాడు హీరో కార్తికేయ తెరపై చాలా ఎనర్జిటిక్‌గా కనిపిస్తాడు.. ఈ సినిమాలో కూడా అలానే కనిపించాడు తనకు నచ్చినట్లుగా జీవించే యువకుడుగా శివ‌ పాత్రకు కార్తికేయ‌ న్యాయం చేశాడు. కామెడీతో పాటు యాక్షన్ సీన్లు కూడా మెప్పించాడు. అలాగే చిత్రగా నిహ శెట్టి పాత్రనిడివి తక్కువ అయిన తన అందచందాలతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. అలాగే ప్రజలను మోసం చేసి డబ్బు సంపాదించాలనే ఆశ ఉన్న‌ భూషణం పాత్రలో అజయ్ ఘోష్ ఒదిగిపోయాడు.. కొన్నిచోట్ల అజయ్ నటన కోట శ్రీనివాసరావు పాత్రలను గుర్తు చేస్తుంది.

ఈ విధంగా ఈ సినిమాలో నటించిన ప్రతి ఒక్కరు నటీనటులు తమ పరిధి మేర‌ నటించారు. ఇక సాంకేతిక విషయానికొస్తే మణిశర్మ సంగీతం పరవాలేదు అనిపించింది.. పాటలు అంత‌గా ఆకట్టుకోలేవు కానీ నేపథ్య సంగీతం బాగుంది.. సినిమా ఆటోగ్రఫీ అద్భుతంగా ఉంది. ఇక ఎడిటర్ పని తీరు బాగానే ఉంది. సినిమాను చాలా షార్ప్‌గా కట్ చేశాడు. ఇక ప్రొడక్షన్ విలువ‌లు కూడా సినిమా స్థాయికి తగ్గట్టు ఉన్నంతగా ఉన్నాయి. మొత్తంగా కార్తికేయ ఆర్ఎక్స్ 100 తర్వాత మరో హిట్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు.