ఎన్టీఆర్ – అనుష్క కాంబినేష‌న్లో 7 సినిమాలు… కాంబినేష‌న్ అందుకే సెట్ కాలేదా…!

మన తెలుగు చిత్ర పరిశ్రమలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ క్రేజ్ గురించి కొత్తగా పరిచయం అవసరం లేదు. 18 సంవత్సరాల వయసులోనే స్టార్ హీరోగా ఉన్న చిరంజీవికే చెమటలు పట్టించాడు. ప్రస్తుతం గ్లోబల్ హీరోగా సూపర్ ఫామ్ లో దూసుకుపోతున్న ఎన్టీఆర్ ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో దేవర సినిమాలో నటిస్తున్నాడు. ఇప్పటికే రెండు షెడ్యూళ్ల‌కు పైగా షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ సినిమా వచ్చే ఏడాది ఏప్రిల్ 5న ప్రేక్షకులు ముందుకు రానుంది.

ఇదే సమయంలో ఎన్టీఆర్ తో అవకాశం వస్తే నటించాలని ఎందరో హీరోలు, హీరోయిన్లు ఎంతో ఆశ పడుతూ ఉంటారు. అవకాశం వస్తే మాత్రం అసలు వదులుకోరు. కానీ గతంలో ఒక హీరోయిన్ మాత్రం ఎన్టీఆర్ పక్కన నటించినకానీ గతంలో ఒక హీరోయిన్ మాత్రం ఎన్టీఆర్ పక్కన నటించడానికి అవకాశం వస్తే ఒకటి కాదు రెండు కాదు ఏకంగా ఏడుసార్లు నో చెప్పిందట. ఇంతకీ ఆ స్టార్ హీరోయిన్ మరెవరో కాదు.. సూపర్ సినిమాతో టాలీవుడ్ లో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చిన ముద్దుగుమ్మ అనుష్క శెట్టి.

ఈ సినిమా తర్వాత ఎన్టీఆర్- అనుష్క కాంబినేషన్లో దాదాపు 7 సినిమాలు మిస్సయ్యాయట. కానీ ఆ ఏడు సినిమాల్లో ఎన్టీఆర్‌కు జంటగా నటించడానికి అనుష్క అసలు ఒప్పుకోలేదట. ఇప్పుడైతే ఎన్టీఆర్ సరైన బాడీ ఫిట్నెస్ తో సూపర్ సెక్సీ లుక్ లో ఉన్నాడు.. కానీ గతంలో ఎన్టీఆర్ చాలా లావుగా ఉండేవాడు సింహాద్రి, సాంబా, రాఖీ వంటి సినిమాల సమయంలో ఎన్టీఆర్ అధిక బరువుగా ఉన్నా కూడా నటన మరియు తన డ్యాన్స్ తో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకునేవాడు.

కానీ అప్పట్లో కొందరు హీరోయిన్లు ఎన్టీఆర్ లావుగా ఉన్నారని ఆయన పక్కన నటించడానికి అంతగా ఆసక్తి చూపేవారు కాదట. ఈ లిస్టులో అనుష్క కూడా ఒకరు.. డైరెక్టర్లు ఈమె వద్దకు కథ చెప్పడానికి వెళ్లి ఎన్టీఆర్ హీరో అని చెప్పగానే వెంటనే కథ కూడా వినకుండా నో అనేసేదట. అలా అనుష్క ఏకంగా ఏడు సినిమాల్లో ఎన్టీఆర్ తో కలిసి నటించడంలో మిస్ చేసుకుంది. ఇక ఎన్టీఆర్ బరువు తగ్గిన తర్వాత అనుష్క- ఎన్టీఆర్ కాంబోలో ఓ సినిమా తీయాలని పలువురు ప్రొడ్యూసర్లు కూడా అనుకున్నారట.

అయితే ఎన్టీఆర్ రేంజ్‌కి అనుష్క హీరోయిన్గా సరిపోదు అంటూ ఆమెను దూరం పెట్టేసారట. అలా ఎన్టీఆర్- అనుష్క శెట్టి కాంబినేషన్లో ఒక్కటంటే ఒక సినిమా కూడా రాలేదు. కాని చింతకాయల రవి సినిమాలో ఎన్టీఆర్- అనుష్క కలిసి ఒక పాటలో రెండు నిమిషాల పాటు కనిపించి ప్రేక్షకులను ఆనందింప చేశారు.