Krithi Shetty : ఆ హీరోయిన్ అనుకున్నంత అమాయకురాలేమి కాదు.. హీరో షాకింగ్ కామెంట్స్..!

ఒక్క సినిమాతో ఓవర్ నైట్ స్టార్ క్రేజ్ తెచ్చుకున్న బెంగుళూరు భామ కృతి శెట్టి (Krithi Shetty) ఉప్పెన హిట్ తో వరుస సినిమాలతో సత్తా చాటుతుంది. ఒక్క హిట్ తో దాదాపు అర డజను సినిమాల దాకా చేస్తూ వచ్చిన కృతి శెట్టి ఈమధ్యనే రామ్ సరసన ది వారియర్ సినిమాలో నటించింది. ఈ సినిమా తర్వాత నితిన్ తో మాచర్ల నియోజకవర్గం సినిమా చేసింది. ఈ నెల 12న ఆ సినిమా రిలీజ్ కాబోతుంది. ఈ సినిమా ఈవెంట్ లో బేబమ్మ అదేనండి కృతి శెట్టి అనుకున్నంత అమాయకురాలేమి కాదని హీరో కామెంట్ చేశాడు.

మాచర్ల ఈవెంట్ లో నితిన్ మాట్లాడుతూ సినిమాలో కృతి శెట్టి చాలా బాగా చేసిందని అన్నాడు. అంతేకాదు ఆమె కనిపించేంత అమాయకురాలేమి కాదు చేస్తున్న పాత్ర పట్ల చాలా ఫోకస్ గా ఉంటుంది. తను చాలా షార్ప్.. స్క్రిప్ట్ లో పూర్తిగా ఇన్వాల్వ్ అవుతుంది అంటూ కృతి శెట్టి (Krithi Shetty) మీద ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. తనకు చాలా మంచి ఫ్యూచర్ ఉంటుందని అన్నాడు నితిన్.

బేబమ్మ టాలెంట్ ఏంటో మొదటి సినిమాతోనే ప్రూవ్ అయ్యింది. అయితే సినిమా సినిమాకు ఆమె నెగటివ్స్ కూడా బయట పడుతున్నాయి. వాటిని కవర్ చేసుకోవడానికి ఈమధ్య అమ్మడు గ్లామర్ రోల్స్ కి కూడా సై అనేస్తుంది.

Tags: Bebamma, Krithi Shetty, Macharla Niyojakavargam, movies, Nitin, Tollywood, Uppena