టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ యువగళం యాత్ర తూర్పుగోదావరి జిల్లాలోని గోపాలపురం నియోజకవర్గంలో పూర్తయింది. మిగిలిన నియోజకవర్గాల సంగతి ఎలా ? ఉన్నా గోపాలపురంలో ఈ యాత్ర ఎలా జరుగుతుందన్నదానిపై ముందు నుంచి పెద్ద ఉత్కంఠే ఉంది. అయితే చాలా ప్రశాంతంగా సక్సెస్ ఫుల్‌గా యాత్ర జరిగింది. గోపాలపురం నియోజకవర్గంలోని పోతవరం, నల్లజర్ల, ప్రకాశరావుపాలెం, సింగరాజుపాలెంలో జరిగిన యాత్రకు ఆద్యంతం అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది.
పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి.. నియోజకవర్గ ఇంచార్జ్ మద్దిపాటి వెంకటరాజు – జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ ముళ్ళపూడి బాపిరాజు ఇతర నేతలు నియోజకవర్గంలో యువగళం పాదయాత్రను ప్రతిష్టాత్మకంగా తీసుకుని ఏర్పాట్లు చేశారు. లోకేష్ పాదయాత్ర చింతలపూడి నియోజకవర్గంలో ఎలాంటి ఊపుతో కంటిన్యూ అయిందో ( మధ్యలో పోలవరంలో ఊపు తగ్గింది) దానిని ఇక్కడ కూడా కంటిన్యూ చేసి విజయవంతం చేశారు. మొదటి రోజు గీత కార్మికులతో సమావేశం చాలా హైలెట్ అయ్యింది. ఇక్కడ 400 మంది వస్తారనుకుంటే అంచనాలకు మించిపోయి 1500 మంది రావడం ప్రోగ్రామ్ సూపర్ సక్సెస్ అయ్యింది. ఇక పాదయాత్ర మొత్తానికే పోతవరంలో స్టాండింగ్ కటౌట్ 75 అడుగులు, మద్దిపాటి స్వగ్రామం ప్రకాశరావు పాలెంలో 70 అడుగుల కటౌట్ హైలెట్‌గా నిలిచాయి.
లోకేష్ కు మద్దిపాటి అత్యంత ఇష్టుడు.. పార్టీ అత్యంత కష్టకాలంలో ఉన్నప్పుడు పార్టీ ఆఫీసులో ప్రతిష్టాత్మకమైన ప్రోగ్రాం కమిటీ ఇన్చార్జిగా చేసిన సేవలకు లోకేష్ ఎప్పుడో ఫిదా అయ్యారు. ఈ క్రమంలోనే మద్దిపాటికి గత ఏడాది నియోజకవర్గ ఇన్చార్జ్ పదవి ఇచ్చే విషయంలో కొంత సందిగ్ధత ఉన్నా చంద్రబాబు నిర్ణయాన్ని వెంటనే లోకేష్ బలపరచడంతో వెంకటరాజుకు వేగంగా ఇంచార్జ్ పదవి దక్కింది. ఇన్చార్జి పదవి వచ్చినప్పటి నుంచి వెంకటరాజు నియోజకవర్గంలో చాలా స్పీడ్ గా దూసుకుపోతున్నారని చెప్పాలి.
నియోజకవర్గంలో చిన్న చిన్న ఇబ్బందులు ఎదురైనా చాలా లౌక్యంగా అందరిని కలుపుకుని వెళుతూ పార్టీపై పూర్తిస్థాయిలో పట్టు సాధించారు. ఇక యువగళం పాదయాత్రలో మద్దిపాటి పనితీరును క్షేత్రస్థాయిలో కూడా దగ్గరుండి మరీ చూసిన లోకేష్ మద్దిపాటిపై ప్రశంసలు కురిపించడంతోపాటు ఇదే పట్టుదల ఇదే ఉత్సాహంతో పనిచేసి ముందుకు వెళ్లి వచ్చే ఎన్నికలలో ఎమ్మెల్యేగా భారీ మెజార్టీతో గెలిచి రావాలని ఆకాంక్ష వ్యక్తం చేసినట్టు తెలిసింది.