బోయపాటి స్కంద మూవీని వ‌దులుకున్నా స్టార్ హీరో ఎవ‌రుంటే..!

ఉస్తాద్ రామ్, మాస్ డైరెక్టర్ బోయపాటి కాంబినేషన్లో వస్తున్న మాస్ కమర్షియల్ ఎంటర్టైనర్ మూవీ స్కంద. ఈ మూవీ రిలీజ్ డేట్ దగ్గర పడుతుండటంతో మేకర్స్ ప్రమోషన్స్‌లో జోరు పెంచారు. ఇక లేటెస్ట్ గా స్కంద నుంచి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ బ‌య‌ట‌కు వ‌చ్చింది. అదేంటంటే డైరెక్టర్ బోయపాటి ముందుగా స్కంద స్టోరీని మరో టాలీవుడ్ స్టార్ కు వినిపించాడట. బోయపాటి ఆ స్టార్ హీరోను ఊహించుకుంటూ ఈ స్టోరీని డెవలప్ చేశాడని సమాచారం.

ఇంతకీ ఆ స్టార్ హీరో మరెవరో కాదు… సూపర్ స్టార్ మహేష్ బాబుట. ఇక కంప్లీట్ స్టోరీని మహేష్ కు వినిపించిన తరువాత… ఇంతటి మాస్ యాంగిల్ లో ఉన్న స్కంద స్టోరీ.. తనకి సెట్ అవ్వదని బోయపాటికి చెప్పాడట. ఈ న్యూస్ ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది. ఇక త‌ర్వాత‌ రామ్ కి స్టొరీ చెప్పడంతో సింగిల్ సిట్టింగ్ లోనే ఓకే చెప్పినట్టు సమాచారం. స్కంద మూవీ రామ్ కి ఎలాంటి హిట్ ఇస్తుందో చూడాలి. రీసెంట్ గా స్కంద ప్రీ రిలీజ్ ఈవెంట్ సక్సెస్ ఫుల్ గా జరుపుకుంది.

బాలకృష్ణ గెస్ట్ గా వచ్చి స్కంద టీం కి బుస్ట్ ఇచ్చాడు. అఖండ వంటి బ్లాక్ బస్టర్ తర్వాత బోయపాటి నుంచి వస్తున్న ఈ సినిమాపై అంచనాలు నెక్స్ట్ లెవెల్ లో ఉన్నాయి. ఈ సినిమాలో లేటెస్ట్ బ్యూటీ శ్రీ లీల హీరోయిన్గా నటిస్తుండగా… శ్రీనివాస్ సిల్వర్ స్క్రీన్ పతాకంపై శ్రీనివాస్ చిట్టూరి ఈ సినిమాను నిర్మిస్తున్నాడు. అలాగే ఈ సినిమాకు తమన్ సంగీతం అందిస్తున్నాడు. ఈ మూవీ పాన్ ఇండియా లెవెల్ లో సెప్టెంబర్ 15న ప్రేక్షకుల ముందుకి రానుంది.