పుష్ప 2 మూవీకి 1000 కోట్ల ఆఫర్.. సౌత్ లో ఈ రికార్డ్ బన్నీకి మాత్రమే సొంతమా..?

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవల నేషనల్ అవార్డును దక్కించుకున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాతో భారీ పాపులారిటీ సంపాదించుకున్న అల్లు అర్జున్ అమాంతం ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా రెట్టింపు చేసుకున్నాడు. దీంతో ప్రస్తుతం అల్లు అర్జున్ నటించిన పుష్ప 2 సినిమా మినిమమ్‌ సక్సెస్ గ్యారంటీ అనే అభిప్రాయం ప్రేక్షకుల్లో వచ్చింది. అయితే బన్నీ ప్రస్తుతం పుష్ప 2 సినిమాకు ఏకంగా రూ.1000 కోట్ల రూపాయల ఆఫర్ అందుకున్నట్లు సమాచారం.

పుష్ప 2 థియేటర్, నాన్ ధియేటర్ హక్కుల కోసం మేకర్స్ ఈ భారీ మొత్తాన్ని బన్నీ సినిమాకు మాత్రమే ఆఫర్ చేశారు. ఒక భారీ బడ్జెట్ సినిమా కోసం ఈ రేంజ్ లో ఆఫర్ చేయడం ఇదే మొదటిసారి. సౌత్లో గతంలో ఈ రేంజ్ లో ఆఫర్ ఏ సినిమాకు రాలేదు. మళ్లీ రికార్డ్ బ్రేక్ కావాలన్నా చాలా సమయం పడుతుందని చెప్పవచ్చు. దీంతో ప్రస్తుతం ఈ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. దీనిపై మైత్రి మూవీ మేకర్స్ వారు స్పందిస్తారో లేదో చూడాలి. మైత్రి బ్యానర్‌కు ఇటీవల కాలంలో వరుస విజయాలు అందుతున్నాయి. ఈ బ్యానర్ నుంచి తాజాగా విడుదలైన ఖుషి మూవీ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది.

మైత్రి నిర్మాతలు పుష్ప సినిమా కోసం రూ.450 కోట్లు ఖర్చు చేశారు. ఈ ఖర్చుతో పోల్చి చూస్తే రెట్టింపు స్థాయిలో ఈ సినిమాకు బిజినెస్ జరుగుతుందనటంలో సందేహం లేదు ఒక పుష్ప 2 అంతకుమించి అనే రేంజ్ లో ఉందట. సినిమాపై ప్రేక్షకులు పెట్టుకున్న ఎక్స్పెక్టేషన్స్ ఏ మాత్రం తగ్గవంటూ కామెంట్స్ వినిపిస్తున్నాయి. పుష్ప 2 సినిమా స్క్రిప్ట్ సుకుమార్ ప్రత్యేక దృష్టి పెట్టి చేశాడని.. ఈ సినిమాలో మరిన్ని కొత్త పాత్రలు కనిపించబోతున్నాయని సమాచారం. పుష్ప 2 తో బన్నీ, సుకుమార్ కెరీర్ లోనే మంచి సక్సెస్ సాధించాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.