దర్శక ధీరుడు రాజమౌళికి.. దాన్ని చూస్తే చిన్న పిల్ల‌డిలా ఇప్పటికీ గజగజ వణికి పోతాడా..!?

ప్రస్తుతం ఇప్పుడు మన తెలుగు చిత్ర పరిశ్రమ గురించి ఇంత గొప్పగా ప్రపంచ దేశాలు చెప్పుకుంటున్నాయంటే దానికి ముఖ్య కారణం దర్శక ధీరుడు రాజమౌళి అనే చెప్పాలి. మరి అలాంటి రాజమౌళి గురించి చాలామంది అభిమానులు ఏ చిన్న విషయమైనా తెలుసుకోవడానికి తెగ ఆరాటపడుతూ ఉంటారు. అయితే రాజమౌళి గురించి చాలావరకు అందరికీ తెలిసే ఉంటుంది.

ఇక ఇప్పుడు ఇదే స‌మ‌యంలో రాజమౌళి గురించి ఓ ఇంట్రెస్టింగ్ మేటర్ వైరల్ గా మారింది. ఇంతకీ రాజమౌళి గురించి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న మేటర్ ఏమిటంటే.. అంత పెద్ద స్టార్ డైరెక్టర్ అయ్యుండి ఓ చిన్న విషయానికి కూడా చిన్న పిల్లాడిలా భయపడి పోతాడు అంటూ ఓ వార్తను ఇప్పుడు జనాలు వైరల్ చేస్తున్నారు. గత సంవత్సరం రాజమౌళి తెరకెక్కించిన త్రిబుల్ ఆర్ సినిమాతో ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినీ అభిమానులను మెప్పించి ఆస్కార్ అవార్డును కూడా అందుకున్నాడు.

ఇక జక్కన్న తన తర్వాత సినిమాను మహేష్ బాబు తో పాన్ వరల్డ్ సినిమాగా చేయబోతున్నాడు. ఈ సినిమాకు సంబంధించిన కథను కూడా రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ సిద్ధం చేశాడు. ఆగస్టులో మహేష్ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమాకు సంబంధించి ఓ ఇంట్రెస్టింగ్ అప్డేట్ కూడా బయటకు రానున్నట్టు తెలుస్తుంది. అదేవిధంగా ఈ సంవత్సరం చివర్లో లేదా 2024 మొదట్లో ఈ సినిమా షూటింగ్ మొదలుకానుందని తెలుస్తుంది.

అలాంటి రాజమౌళికి ఓ చిన్న పాముని చూస్తే వణికి పోతాడట . అదేంటో తెలియదు చిన్నప్పటినుంచి ఆయనకి పాము అంటే భయమట. ఆశ్చర్యమేంటంటే ఇప్పటికీ ఆయన పామును చూస్తే గజగజ వణికిపోతూ ఉంటాడు అంటూ సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. ఈ విషయం కారణంగా ఎన్నోసార్లు ఎన్టీఆర్- రాజమౌళిని ఆటపట్టించాడట. ప్ర‌స్తుతం ఇదే వార్త‌ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది..!!