నందమూరి నటసింహం బాలయ్య హీరోగా కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా దర్శకుడు అనిల్ రావిపూడి కాంబినేషన్లో తెరకెక్కుతోన్న సాలిడ్ మాస్ యాక్షన్ సినిమా ‘ భగవంత్ కేసరి ‘. మరి ఈ చిత్రం నుంచి వస్తున్న ఒకో ప్రమోషనల్ కంటెంట్ మూవీ పై భారీ హైప్ ని తీసుకొస్తుంది.
వీర సింహారెడ్డి తర్వాత బాలయ్య మళ్లీ ఈ సినిమాతో హిట్ కొట్టబోతున్నాడని వచ్చే రెస్పాన్స్ చూస్తే ఇప్పటికే అర్థమైంది. అయితే ఈ సినిమా షూటింగ్ వేగంగా కంప్లీట్ అవుతుండగా నెక్స్ట్ ఈ సినిమా నుంచి వరుస అప్డేట్స్ రానున్నట్లుగా తెలుస్తుంది.
లేటెస్ట్ బజ్ ప్రకారం అయితే ఈ ఆగస్టు మూడో వారం నుంచి భగవంత్ కేసరి సినిమా మేనియా స్టార్ట్ కానున్నట్లుగా తెలుస్తుంది. ఈ క్రమంలో నందమూరి ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు. ఇక ఈ చిత్రానికి థమన్ సంగీతం అందిస్తున్నాడు. అలాగే శరత్ కుమార్, శ్రీ లీల తదితరులు ముఖ్య పాత్రల్లో నటిస్తున్నరు. అలాగే షైన్ స్క్రీన్ సినిమాస్ వారు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇక అక్టోబర్ 19న భగవంత్ కేసరిగా బాలయ్య బాక్సాఫీస్ వద్ద గర్జింజనున్నాడు.