రాజమౌళి తన సినిమాలో హీరోయిన్లను అది చూసే సెలక్ట్ చేస్తాడా..!

చిత్ర పరిశ్రమలో ఎంత మంది దర్శకులు ఉన్నా దర్శక ధీరుడు రాజమౌళి పేరు చెప్తే వచ్చే వైబ్రేషన్స్, గూస్ బంప్స్ వేరే లెవెల్. ఎలాంటి స్టార్ హీరోకైనా, హీరోయిన్ కైనా ఒక్కసారైనా రాజమౌళితో పని చేయాలని కోరిక ఉంటుంది. అంతలా తన సినిమాలతో తన పేరుకి పాపులారిటీ తెచ్చుకున్నాడు ఈ దర్శకధీరుడు. కాగా చిత్ర పరిశ్రమలో ఉండే అగ్ర హీరోలతో సినిమాలు చేయడానికి ఇష్టపడే రాజమౌళి తన సినిమాల్లో మాత్రం స్టార్ హీరోయిన్లను కాకుండా క్రేజ్ లేని హీరోయిన్ పెట్టుకోవడానికి ఎక్కువ ఆస‌క్తి చూపిస్తూ ఉంటాడట.

Genelia turns 28, gets wishes galore from B-Town

దీనికి ప్రధాన కారణం ఆ హీరోయిన్ల కాల్ షీట్స్ . ఇండస్ట్రీలో ఎలాంటి ప‌రిస్థితుల్లో ఉందో అందరికీ తెలిసిందే. ఓ సినిమాని చేస్తూ మరో నాలుగు సినిమాలకు కమిట్ అయ్యే ముద్దుగుమ్మలు ఉన్నారు. అయితే జక్కన్న మైండ్ సెట్‌కి అలాంటివి సెట్ అవ్వవు. ఆయన సినిమాకు కమిట్ అయితే మరే సినిమాలోను నటించకూడదు. హడావిడిగా ఇక్కడ షూటింగ్.. అక్కడ షూటింగ్ అంటూ లేనిపోని సాకులు చెప్పకూడదు.

Gajala Family Husband Biography Parents children's Marriage Photos

అందుకే జక్కన్న తన సినిమాలో హీరోయిన్ల‌ని సెలెక్ట్ చేసుకునే ముందు వాళ్ళు ఏ సినిమాలకు కమిట్ అయి ఉన్నారా ..? ఎప్పుడు ఆ సినిమాలు కంప్లీట్ అవుతాయి.. మనకి ఎన్ని కాల్ షీట్స్ ఇవ్వగలుగుతారు ? కాల్ షీట్స్ ఇచ్చాక ఇబ్బంది పెట్టరు కదా ..? అన్న విష‌యాలు చూసుకొని సెలెక్ట్ చేసుకుంటారట.

Actress BHUMIKA CHAWLA Simple Homely Beauty Photos - Ragalahari

ఎంత ఇష్టపడిన హీరోయిన్ అయినా సరే ..ఆమె కాల్ షీట్స్ బిజీగా ఉంటే ..ఆమెను కచ్చితంగా సినిమాకి సెలెక్ట్ చేసుకోరట. ఇప్పటివరకు చూసుకున్నట్లయితే రాజమౌళి సినిమాలో నటించిన హీరోయిన్స్ అందరూ అదే కోవ‌లోకి వస్తారు. తన సినిమాకి కమిట్ అయినప్పుడు ఆ హీరోయిన్స్ వేరే ఏ సినిమాకి కమిట్ అవ్వరు. టోటల్ రాజమౌళికే ఆ టైంను కేటాయిస్తారు. ఏదేమైనా సరే ఇండస్ట్రీలో రాజమౌళి పైకి కనిపించడు కానీ మహా జాదుగాడే అంటున్నారు ఫాన్స్.

Anushka Shetty Sitting On A Rosy OTT Debut Offer from Netflix?