ఎన్టీఆర్‌కు కొర‌టాల పెట్టిన‌ పెద్ద కండీష‌న్ ఇదే…!

జూనియర్ ఎన్టీఆర్ కొరటాల శివ కాంబినేషన్లో తెరకెక్కుతున్న భారీ పాన్ ఇండియా సినిమా దేవర. ఎన్టీఆర్ కెరీర్ లో 30వ సినిమాగా తెరకెక్కుతున్న ఈ సినిమాకు సంబంధించి ఇప్పటికే రెండు షెడ్యూల్స్ పూర్తయ్యాయి. ఆచార్య లాంటి బిగ్గెస్ట్ డిజాస్టర్ తర్వాత కొరటాల శివ దేవర మూవీ తెర‌కెక్కిస్తున్నాడు. ఆచార్య విషయంలో చేసిన తప్పులు మళ్ళీ రిపీట్ కాకుండా ఈ సారి స్క్రిఫ్ట్ ప‌ర్‌ఫెక్ట్‌గా పూర్తి చేసి కొర‌టాల ఈ సినిమాను సెట్స్ మీద‌కు తీసుకువెళ్లాడు.

కొర‌టాల ఈ సినిమా ఫస్ట్ షెడ్యూల్ ని యాక్షన్ సీక్వెన్స్‌తోనే ప్రారంభించాడు. ఇక రెండో షెడ్యూల్ లో యాక్షన్ సీక్వెన్స్, టాకీ పార్ట్ సీన్లు తెరకెక్కించారు. తరువాత షూటింగ్ కి విరామం ఇచ్చాక ఇప్పుడు మూడో షెడ్యూల్ స్టార్ట్ చేస్తున్నారు. తారక్ ప్రస్తుతం ఫ్రీ టైమ్‌లో తాను కమిట్ అయిన కమర్షియల్ యాడ్స్ షూటింగ్ పూర్తి చేశారు.

తాజాగా హైదరాబాద్ లో జరిగిన యాడ్ షూటింగ్ పూర్తి చేశాడు. ఈ యాడ్‌లో తారక్ స్టైలిష్ మేకోవర్ లుక్స్ బయటకొచ్చాయి. ఇక జూన్ ఫ‌స్ట్ వీక్ నుంచి మ‌ళ్లీ దేవ‌ర షూటింగ్ నెక్ట్స్ షెడ్యూల్ స్టార్ట్ కానుంది. నెల రోజుల పాటు కంటిన్యూగా జ‌ర‌గ‌నుంది. ఎన్టీఆర్‌కు కొర‌టాల నెల రోజుల పాటు కంటిన్యూగా కాల్షీట్లు ఇవ్వాల‌ని కండీష‌న్ పెట్టాడట‌.ఈ నెల రోజుల్లో ఇత‌ర ప‌నులు పెట్టుకోవ‌ద్ద‌ని చెప్పేశాడ‌ట‌.

ఇక న‌వంబ‌ర్ వ‌ర‌కు జ‌రిగే షూటింగ్‌తో దేవ‌ర సినిమా కంప్లీట్ చేసేయాల‌న్న‌దే కొర‌టాల పెట్టుకున్న కండీష‌న్‌. ఆ వెంట‌నే డిసెంబ‌ర్ నుంచి ఎన్టీఆర్ బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ తో కలిసి చేయబోయే వార్ 2 కి రెడీ అవుతున్నాడు. వార్ 2 సినిమా కోసం తార‌క్ మూడు నెల‌ల కంటిన్యూ కాల్షీట్లు ఇచ్చాడ‌ని తెలిసింది. అది పూర్త‌య్యాక ప్ర‌శాంత్ నీల్ సినిమా స్టార్ట్ అవుతుంద‌ని అంటున్నారు.