స్ర్తీలపై సాగున్న అఘాయిత్యాలు అన్నీ ఇన్నీ కావు. ఒక్క భారత్ మాత్రమే కాదు ప్రపంచ వ్యాప్తంగా ఇదే పరిస్థితి నెలకొంది. అందుకు నిదర్శంగా నిలుస్తున్నది ఈ ఘటన. భార్య తనను మోసం చేస్తున్నదని అనుమానం పెంచుకున్న ఓ భర్త ఘోర అకృత్యానికి తెగబడ్డాడు. తాను బయటకి వెళ్తున్న ప్రతిసారీ భార్య జననాంగాలపై సీల్ చేసి ఫైశాచికంగా వ్యవహరిస్తున్నాడు. ఈ సంఘటన కెన్యాలో వెలుగు చూసింది. సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నది. తీరా విషయం ఆ నోట ఈ నోట పడి పోలీసుల దృష్టికి చేరడంతో సదరు భర్తను అరెస్టు చేసి జైలుకు పంపారు. అధికారులు తెలిపిన కథనం ప్రకారం..
కెన్యాకు చెందిన డెన్నిస్ ముమో వ్యాపారం చేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. ఇటీవల కొద్దికాలం క్రితం నుంచి భార్యపై అనుమానం పెంచుకున్నాడు. తనను మోసం చేస్తూ నలుగురు వ్యక్తులతో అక్రమ సంబంధం పెట్టుకుందని భావించాడు. ఇదే విషయమై పలుమార్లు భార్యతో ఘర్షణకు సైతం దిగాడు. అక్కడితో ఆగకుండా తాను ఎలాంటి తప్పు చేయడం లేదని భార్య మొత్తుకున్న వినకుండా పైశాచిక ఆకృత్యానికి దిగాడు. తాను ఇంటి నుంచి వెళ్లే సమయంలో జిగురు లాంటి పదార్థంతో ఆమె జననాంగాలను సీల్ వేయడం మొదలు పెట్టాడు. ఎప్పటిలాగే ఇటీవల కూడా అలాగే చేశాడు. అయితే ఆ పదార్థాన్ని రాసిన తీవ్రమైన మంటల లేవడంతో ఆమె వెంటనే హాస్పిటల్‌కు వెళ్లింది. విషయం తెలిసిన వైద్యులు నివ్వెరపోయారు. ఆమెకు చికిత్స అందజేయడంతో పాటు విషయాన్ని పోలీసుల దృష్టికి తీసుకెళ్లారు. దీంతో రంగంలోకి అధికారులు ఆమె నుంచి వివరాలు కనుక్కుని భర్తపై గృహహింస చట్టం కింద కేసు నమోదు చేశారు. అరెస్ట్ చేసి విచారణ చేపట్టారు.
అయితే సదరు భర్త పోలీసుల వద్ద కూడా నానా హంగామా చేయడం గమనార్హం. తన భార్య అక్రమ సంబంధం పెట్టుకుని వాదనకు దిగాడు. నగ్నచిత్రాలు వారికి పంపిస్తూ సెక్స్ చాట్ కూడా చేస్తున్నదని, ఇటీవల ఆమె సెల్‌ఫోన్లో వాటిని చూసి షాకయ్యానని, అందుకే అలా ప్రవర్తించానని వివరించారు. చివరగా తన వివాహ బంధాన్ని కాపాడాలని పోలీసులను వేడుకోవడం కొసమెరుపు. అయితే భర్త చేసిన ఆరోపణలకు ఆధారాలు లేకపోవడంతో అతనని పోలీసులు కోర్టులో హాజరుపరిచారు. దీనిపై విచారణ సోమవారానికి వాయిదా పడింది.