ప‌వ‌న్‌క‌ల్యాణ్‌కు న‌టి శ్రీ‌రెడ్డి వార్నింగ్‌..

కాస్టింగ్ కౌచ్ ఆరోప‌ణ‌ల‌తో టాలీవుడ్‌ను షేక్ చేసిన శ్రీరెడ్డి గురించి తెలుగు రాష్ట్రాల్లోని ప్ర‌జ‌లంద‌రికీ తెలిసిందే. ఆమె నోరు విప్పితే ఎలాంటి మాటలు వస్తాయన్న సంగతీ విధిత‌మే. మీటూ ఉద్యమంలో భాగంగా అర్ధనగ్న ప్రదర్శన చేసి అందరి దృష్టిని తన వైపుకు తిప్పుకుంది. ఆ ఘ‌ట‌న త‌రువాత చాలా రోజులుగా మీడియాలో లేకుండా పోయింది. ప్రస్తుతం వంట‌ల‌కు సంబంధించిన ఓ యూట్యూబ్ చాన‌ల్‌ను నిర్వ‌హిస్తూ చెన్నైలో స్థిర‌ప‌డింది ఈ భామా. చాలా కాలం త‌రువాత ఇటీవ‌ల కొద్ది రోజులుగా మ‌ళ్లీ త‌న నోటికి పెట్టింది ఈ తారా. సంచ‌ల‌న కామెంట్స్ చేస్తూ హాల్ చేస్తున్న‌ది. ఇటీవ‌లే ద‌ర్శ‌కుడు శేఖ‌ర్‌క‌మ్ముల త‌న‌కు సినిమా అవ‌కాశం ఇవ్వ‌లేద‌ని, చీపురు పుల్ల‌లా ఉన్నాడ‌ని, ఊదితే ఎగిరిపోతాడ‌ని తీవ్ర వ్యాఖ్య‌లు చేసింది. దానిపై టాలివుడ్‌లో ఇప్ప‌టికే జోరుగా చ‌ర్చ‌లు సాగుతున్నాయి. అది స‌మ‌సిపోక‌ముందే మ‌రోసారి విరుచుకుప‌డింది ఈ భామా.

ఈ సారి ఏకంగా మ‌రోమారు మెగా ఫ్యామిలీని టార్గెట్ చేసింది. అదీగాకుండా స‌హ న‌టి క‌రాటే క‌ల్యాణి, కొరియో గ్రాఫ‌ర్ రాకేష్‌పై బూతుల వ‌ర్షం కురిపించింది. టీవీ ఇంట‌ర్వ్యూల్లో త‌న గురించి అసంభ్యంగా మాట్లాడుతున్నారంటూ మండిప‌డింది. త‌న‌కు డ‌బ్బులు ఎలా వ‌స్తున్నాయి? ఆడి కారు ఎలా వ‌చ్చింది? అని విష‌యాలు కాకుండా.. ద‌మ్ముంటే చిరంజీవి కూతురు గురించి మాట్లాడాల‌ని స‌వాల్ విసిరిసింది. ‘ఏమే కళ్యాణి… నీకు ఎంత మంది మొగుళ్లు ఉన్నారో నాకు తెలీదనుకుంటున్నావా? నువ్వెంత మందని వదిలేసావో నేను చెప్పనా? నీ మాజీ మొగుడు ఓసారి పార్టీలో నన్ను కలిసి నీ గురించి అంతా చెప్పాడు. అవన్నీ బయటపెట్టమంటావా? పిల్లా పీచు లేని నీకు నాలాంటి మరో ఆడపిల్లపై నోరు పారేసుకోవడం వల్ల నీకేం వస్తుందే?’’ అంటూ ఆగ్హ‌హం వ్య‌క్తం చేసింది.

అలాగే కొరియో గ్రాఫ‌ర్ రాకేష్‌ను ఉద్దేశించి ‘‘ఒరేయ్ రాకేష్‌గా నీకు ఎప్పుడో నా చేతిలో బాగా గట్టిగా పడతాయి. అసలు నీ గురించి నేను ఎప్పుడూ ఇంటర్వ్యూలో తప్పుగా మాట్లాడింది లేదు. నేనేదో రెండేళ్ల క్రితం ఓ ఇంటర్వ్యూలో ఓ పార్టీకి నన్ను పిలిచారు, నాకు తీరిక లేక వెళ్లలేదు అని చెప్పుకున్నాను. అందులో తప్పేముంది? కరోనా వైరస్, కుక్కలు అని ఏవేవో మాట్లాడుతున్నావ్. నీకెంత మంది పెళ్లాలు లేర్రా? నేను నీ ప్రొఫెషన్ గురించి మాట్లాడట్లేదు. నాలుగు కుప్పిగంతులు వేసేసినంత మాత్రాన నువ్వు డ్యాన్సర్‌వి అయిపోవు. నిన్ను డ్యాన్సర్‌గా కాకుండా నువ్వేంటో తెలిసినదాన్ని నేను’’ అని గ‌ట్టి కౌంట‌ర్ ఇచ్చింది. వారిద్ద‌రూ టీడీపీ కుక్క‌ల‌ని, తాను వైసీపీని స‌పోర్ట్ చేస్తున్నందువ‌ల్లే త‌న‌న టార్గెట్ చేశార‌ని ఆరోపించ‌డం గ‌మ‌నార్హం.

ప‌నిలో ప‌నిగా మెగా ఫ్యామిల‌పై ప‌డింది. పవన్ కళ్యాణ్ గారూ మీకు ఎక్కడెక్కడ ఎన్ని ఆస్తులు ఉన్నాయో నాకు తెలుసు. మీపై ఇప్పటికే చాలా ఆరోపణలున్నాయి. ముందు మీరు మీ ప‌న్నుల‌ను సక్రమంగా కట్టండి. నాతో పెట్టుకోవద్దు. పెంటన్నా తక్కువ వాసన వస్తదేమో కానీ న్న‌ను గెలికితే మీరు భరించలేరు. నాతో పెట్టుకోవ‌ద్దు. ఇక మీ జీవితం ఇక ముందుకు వెళ్లదు అంటూ వార్నింగ్ ఇవ్వ‌డం సంచ‌ల‌నంగా మారింది. శ్రీ‌రెడ్డి చేసిన ఈ వ్యాఖ్య‌లు ఇప్ప‌టు టాలివుడ్‌లో హాట్ టాపిక్‌గా మారాయి. మ‌రోసారి షేక్ చేస్తున్నాయి. చివ‌ర‌కు మ‌హిళ‌లు త‌న‌లాగే శివంగుల్లా ఉండాల‌ని ఆమె సూచించ‌డం కొస‌మెరుపు.

Tags: chiru, coreographer rakesh, karate kalyani, Pawan kalyan, sri reddy