పౌరాణిక పాత్రలు అనగానే.. ఒకప్పుడు అంజలీదేవి, రాజసులోచన, దేవిక వంటివారు ముందు వరుసలో ఉండేవారు. తర్వాత కాలంలో కేఆర్ విజయ బాగా రాణించారు. అయితే.. అప్పట్లో భానుమతి, సావిత్రి సహా షావుకారు జానకి వంటి కొందరు హీరోయిన్లు పౌరాణిక పాత్రలు చేసేందుకు ముందుకు వచ్చేవారు కాదు. ఎందుకంటే.. తర్వాత సాంఘిక సినిమాల్లో అవకాశాలు తగ్గిపోతాయనే సెంటిమెంటు ఎక్కువగా ఉండడమే. ఇదే సూత్రాన్ని శ్రీదేవి కూడా పాటించారు.
ఆమె అనేక సినిమాల్లో నటించినా.. పౌరాణిక సినిమాల్లో మనకు ఎక్కడా కనిపించకపోవడానికి సెంటిమెంటే కారణమని అంటారు. అదేసమయంలో జయసుధ, జయప్రద వంటివారు.. కొన్ని కొన్నిపౌరాణిక సినిమాల్లో నటించారు. వారు రాణించారు కూడా. వేంకటేశ్వర మహత్యం సినిమాలో జయసుధ, జయప్రద కలిసి పౌరాణిక పాత్రలు వేశారు. ఈ సినిమాకు శ్రీదేవిని అడిగితే.. కాదన్నారు.
ఎందుకంటే.. ఒకసారి పౌరాణిక పాత్రలు వేస్తే.. ఇక, అదే మూడ్‌లో ప్రేక్షకులు ఉంటారని.. తన ఇమేజ్ తగ్గుతుందని ఆమె భావించేవారు. ఇది.. చాలా సినిమాల్లో గతంలో నటించిన వారు ఎదుర్కొన్న సమస్య. అంతెందుకు.. అన్నగారు ఎన్టీఆర్ పౌరాణిక పాత్రల తర్వాత వేసిన అనేక పాత్రలను ప్రేక్షకులు రిసీవ్ చేసుకునేందుకు సమయం పట్టింది. అంతేకాదు.. రామారావు అనేక పాత్రలు వేసినా.. ఇప్పటికీ రాముడు, కృష్ణుడు వంటి పాత్రలనే ప్రేక్షకులు గుర్తు పెట్టుకున్నారు.
ఇక, అక్కినేని నాగేశ్వరరావు కూడా.. పౌరాణిక పాత్రలకు దూరంగా ఉన్నారు. దీనికి కారణం ప్రేక్షకులు తమను రిసీవ్ చేసుకునే విధానమేనని చెబుతారు. ఇలా.. శ్రీదేవి కూడా.. అనేక సినిమాలు వదులుకున్నారు. ఇలాంటి సందర్భంలో నే శ్రీదేవి పాత్ర ఒకానొక సందర్భంలో కేఆర్ విజయకు వచ్చింది. ఆ సినిమా సూపర్ హిట్ కొట్టింది. దీంతో కేఆర్ విజయ కూడా వరుసగా పౌరాణిక పాత్రలక పరిమితం కావాల్సి వచ్చింది. ఇదీ.. సంగతి..!