భ‌ర్త‌తో నిహారిక విడాకులు.. వ‌రుణ్ ఎంగేజ్మెంట్ సాక్షిగా బ‌య‌టప‌డిన బండారం..!

మెగా డాటర్, నటి నిర్మాత నిహారిక కొణిదెల త‌న‌ భర్త జొన్నలగడ్డ చైతన్యతో విడిపోయిందంటూ గత కొద్దిరోజుల నుంచి పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. 2020 డిసెంబర్లో వీరిద్దరూ వివాహం చేసుకున్నారు. అప్పట్లో వీరి పెళ్లి అంగరంగ వైభవంగా జరిగింది. కానీ పెళ్లై మూడేళ్లు గ‌డవకముందే నిహారిక, చైతన్య మ‌ధ్య మనస్పర్ధలు త‌లెత్తాయి. అవి పెరిగి పెరిగి విడాకుల వరకు దారి తీశాయ‌ని వార్తలు వస్తున్నాయి.

ఈ విషయంపై ఇంతవరకు మెగా ఫ్యామిలీ రియాక్ట్ కాలేదు. అయితే నిహారిక చైతన్య జంటగా కనిపించి చాలా కాలం అయిపోయింది. పైగా సోషల్ మీడియా అకౌంట్స్ లో ఒకరినొకరు అన్ ఫాలో అవ్వడం, ఇన్‌స్టాగ్రామ్ లో ఇద్ద‌రూ త‌మ‌ పెళ్లి ఫోటోలు డిలీట్ చేయడం వంటి అంశాలు నెట్టింట జరుగుతున్న ప్రచారానికి మరింత బలాన్ని చేకూర్చాయి.

రీసెంట్ గా విడాకుల గురించి నిహారికను ప్రశ్నించుగా ఆమె తెలివిగా తప్పించుకుంది. అయితే రేపు నిహారిక అన్న, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ నిశ్చితార్థం జరగబోతోంది. ప్రముఖ హీరోయిన్ లావణ్య త్రిపాఠి తో చాలా ఏళ్ల నుంచి ప్రేమాయణం నడిపిస్తున్న వ‌రుణ్‌.. త్వరలోనే ఆమెతో ఏడడుగులు వేయ‌బోతున్నాడు. జూన్ 9న హైదరాబాద్ లో వీరి ఎంగేజ్మెంట్ జరగబోతోంది.

అయితే ఈ ఎంగేజ్మెంట్ తో నిహారిక విడాకుల బండారం బయటపడనుంది. చైతన్య ఈ ఎంగేజ్మెంట్ వేడుకకు దూరంగా ఉంటే.. భ‌ర్త‌తో నిహారిక‌ విడాకులు దాదాపు కన్ఫామ్ అయిపోతాయని అందరూ అభిప్రాయపడుతున్నారు. ఈ నేప‌థ్యంలోనే రేపు జ‌ర‌గ‌బోయే వ‌రుణ్‌-లావ‌ణ్యల‌ ఎంగేజ్మెంట్ పై స‌ర్వ‌త్రా ఆస‌క్తి నెల‌కొంది.

Tags: celebrities news, latest film news, latest filmy updates, latest news, Lavanya Tripathi, niharika, social media, Star hero, Star Heroine, telugu news, Tollywood, varuntej, viral news