40 ఏళ్ల ‘ సాగ‌ర‌సంగ‌మం ‘ .. తెర‌వెన‌క ఇన్ని ఇంట్ర‌స్టింగ్ విష‌యాలు దాగి ఉన్నాయా ?

సాగర సంగమం 4 దశాబ్దాల క్రితం కళాతపస్వి విశ్వనాథ్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో కమల్ హాసన్, జయప్రద నటించారు. ఏడిద‌ నాగేశ్వరరావు ప్రొడక్షన్ లో వచ్చిన ఈ సినిమా అప్పట్లో బాక్సాఫీస్ వద్ద ఎంత పెద్ద హిట్ అయిందో తెలిసిందే. ఇప్పటికి సాగర సంగమం సినిమా టీవీల్లో వస్తుందంటే కోట్లాదిమంది ప్రేక్షకులు ఆ సినిమాను వీక్షించేందుకు ఎదురు చూస్తూ ఉంటారు.

ఇప్పటికీ ఎప్పటికీ టాలీవుడ్‌లో నిలిచిపోయే గొప్ప సినిమాల్లో సాగర సంగమం ఒకటి. కమల్ హాసన్ హీరోగా ఇళయరాజా సంగీతంలో కే విశ్వనాథ్‌ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఇప్ప‌ట‌కీ ఓ అజ‌రారామం. ఈ సినిమా హిట్ కావడానికి జంధ్యాల మాటలు ఇంపార్టెంట్ రోల్ ప్లే చేశాయి. ఇళయరాజా సంగీతం వేటూరి సాహిత్యంలో వచ్చిన పాటలు అన్నీ ప్రేక్షకులను ఎంతగానో మెప్పించాయి.

జూన్ 3 1983లో రిలీజ్ అయిన ఈ సినిమా తమిళంలో సలంగై వలి.. తెలుగు, మలయాళంలో సాగర సంగమం పేర్లతో రిలీజ్ అయింది. అయితే ఈ సినిమా గురించి కొన్ని తెలియ‌ని ఇంట్ర‌స్టింగ్ విష‌యాలు ఉన్నాయి.

1. సాగ‌ర‌సంగ‌మం సినిమా రిలీజై ఈ నెల 3వ తేదీనాటికి 40 సంవత్సరాలు పూర్తయ్యాయి.
2. విశ్వనాథ్ – ఏడిద‌ నాగేశ్వరరావు కాంబినేషన్లో శంకరాభరణం.. ఆ త‌ర్వాత వ‌చ్చిన‌ సాగర సంగమం సినిమా కూడా హిట్ కావ‌డం విశేషం.
3. సిఎన్ ఎన్, ఐబిఎన్ లిస్ట్ ఆఫ్ 100 గ్రేటెస్ట్ ఇండియన్ ఫిలింస్‌ అఫ్ ఆల్ టైం వేదికపై ఈ సినిమా 13వ ప్లేస్ ద‌క్కించుకుంది.

4. సాగర సంగమం సినిమా ఇక్కడే కాకుండా జపాన్లో కూడా 400 థియేటర్లలో రిలీజ్ అయ్యి సూపర్ హిట్‌ అందుకుంది. జ‌పాన్ లో అన్ని థియేటర్లో రిలీజ్ అయి హిట్ కొట్టిన సినిమాల్లో సాగర సంగమం మొదటి తెలుగు సినిమా.
5. అప్పట్లో బెంగుళూరులో ఒకే థియేటర్లో 511 రోజులు ఆడిన సాగర సంగమం సినిమా ప్ర‌భావంతో చాలామంది క్లాసికల్ డ్యాన్స్ నేర్చుకున్నారు.
6. ఈ సినిమాకు సంగీతం అందించిన ఇళయరాజాకు జాతీయ‌ అవార్డు దక్కింది. కమల్ హాసన్ నటించిన కొన్ని వందల సినిమాల్లో తనకు మనసుకు నచ్చిన సినిమా ఏదంటే కమల్ హాసన్ సాగర సంగమం పేరే చెబుతారు.

7. ఈ సినిమాలో సంగీతానికే కాక పాటలు పాడినందుకు ఎస్పీ బాలసుబ్రమణ్యంకి కూడా నేషనల్ అవార్డు వచ్చింది.
8. సాగర సంగమం సినిమా కేవలం శ‌త దినోత్సవాలే కాక ఎన్నో థియేటర్స్ లో సిల్వర్ జూబ్లీ, గోల్డెన్ జూబ్లీ కూడా జరుపుకుంది. తెలుగు సినిమాల్లో ఆల్ టైం క్లాసిక్ గా చెప్పుకునే సినిమాల్లో సాగర సంగమం మొదటిది.

Tags: celebrities news, ilayaraja, k viswanadh, kamal hassan, latest film news, latest filmy updates, latest news, sagara sangamam, social media, Star hero, Star Heroine, telugu news, Tollywood, viral news